అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్టకు
adigadigoo alladigoo kalvari mettaku
అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్టకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో ||అదిగదిగో||
adigadigoo alladigoo kalvari mettaku daaradigoo aa prabhuvunu veesina siluvadigoo ||adigadigoo||
గెత్సేమను ఒక తోటదిగో ఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో (2) అచటనే యుండి ప్రార్ధించుడని పలికిన క్రీస్తు మాటదిగో (2) ||అదిగదిగో||
gethseemanu oka thootadigoo aa thootaloo praardhana sthalamadigoo (2) achatanee yundi praardhinchudani palikina kreesthu maatadigoo (2) ||adigadigoo||
శిష్యులలో ఇస్కరియోతు యూదాయను ఒక ఘాతకుడు ప్రభువును యూదులకప్పగింప పెట్టిన దొంగ ముద్దదిగో లేఖనము నెరవేరుటకై ఈ లోకపు పాపము పోవుటకై పావనుడేసుని రక్తమును గల ముప్పది రూకల మూటదిగో చలి కాచుకొను గుంపదిగో ఆ పేతురు బొంకిన స్థలమదిగో మూడవసారి బొంకిన వెంటనే కొక్కొరొకోయను కూతదిగో యూదుల రాజువు నీవేనా మోదముతో నీవన్నట్లే నీలో దోషము కనుగొనలేక చేతులు కడిగిన పిలాతుడాడుగో గొల్గొతా స్థల అద్దరిని ఆ ఇద్దరు దొంగల మధ్యమున సాక్షాత్తు యెహోవా తనయుని సిలువను వేసిరి చూడదిగో గొల్లున ఏడ్చిన తల్లదిగో ఆ తల్లికి చెప్పిన మాటదిగో యూదుల రాజా దిగి రమ్మనుచు హేళన చేసిన మూకదిగో దాహము గొనుచున్నాననుచు ప్రాణము విడిచెను పావనుడు పరిశుద్ధుడు మన రక్షకుడేసు మన మది యేమో గమనించు
shissyulaloo iskariyoothu yuudaayanu oka ghaathakudu prabhuvunu yuudulakappaginpa pettina donga muddadigoo leekhanamu neraveerutakai ee lookapu paapamu poovutakai paavanudeesuni rakthamunu gala muppadi ruukala muutadigoo chali kaachukonu gunpadigoo aa peethuru bonkina sthalamadigoo muudavasaari bonkina ventanee kokkorokooyanu kuuthadigoo yuudula raajuvu neeveenaa moodamuthoo neevannatlee neeloo doossamu kanugonaleeka cheethulu kadigina pilaathudaadugoo golgothaa sthala addarini aa iddaru dongala madhyamuna saakssaaththu yehoovaa thanayuni siluvanu veesiri chuudadigoo golluna eedchina thalladigoo aa thalliki cheppina maatadigoo yuudula raajaa digi rammanuchu heellana cheesina muukadigoo daahamu gonuchunnaananuchu praannamu vidichenu paavanudu parishuddhudu mana rakssakudeesu mana madi yeemoo gamaninchu