అమూల్యమైన ఆణిముత్యమా యెహోవ దేవుని
amuulyamaina aannimuthyamaa yehoova deevuni
అమూల్యమైన ఆణిముత్యమా యెహోవ దేవుని హస్తకృతమా (2) అపురూప సౌందర్య రాశివి నీవు ఆత్మీయ సుగుణశీలివి నీవు (2) ||అమూల్యమైన||
amuulyamaina aannimuthyamaa yehoova deevuni hasthakruthamaa (2) apuruupa saundarya raashivi neevu aathmeeya sugunnasheelivi neevu (2) ||amuulyamaina||
జ్ఞానము కలిగి నోరు తెరచుదువు కృపగల ఉపదేశమును చేయుదువు ఇంటివారిని బాగుగ నడుపుచూ వారి మన్ననలను పొందుచుందువు చేతులతో బలముగా పనిచేయుదువు బలమును ఘనతను ధరించుకొందువు రాత్రివేళ నీ దీపము ఆరదు కాంతికిరణమై మాదిరి చూపుదువు దీనులకు నీ చేతులు పంచును దరిద్రులను నీవు ఆదుకొందువు దూరము నుండి ఆహారము కొనుచు మంచి భోజనముతో తృప్తిపరచుదువు
jnyaanamu kaligi nooru therachuduvu krupagala upadeeshamunu cheeyuduvu intivaarini baaguga nadupuchuu vaari mannanalanu ponduchunduvu cheethulathoo balamugaa panicheeyuduvu balamunu ghanathanu dharinchukonduvu raathriveella nee deepamu aaradu kaanthikirannamai maadiri chuupuduvu deenulaku nee cheethulu panchunu daridrulanu neevu aadukonduvu duuramu nundi aahaaramu konuchu manchi bhoojanamuthoo thrupthiparachuduvu