అంబరాన్ని దాటే సంబరాలు నేడు
anbaraanni daatee sanbaraalu needu
అంబరాన్ని దాటే సంబరాలు నేడు నింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు (2) రండయ్యో రండి రండి దావీదు పురముకు రారాజు పుట్టి ఇల పిలిచెను కొలువుకు (2) ||అంబరాన్ని||
anbaraanni daatee sanbaraalu needu ningiloo chukka butti vachchindi manaku thoodu (2) randayyoo randi randi daaveedu puramuku raaraaju putti ila pilichenu koluvuku (2) ||anbaraanni||
దేవుడు ఎంతగానో ప్రేమించి లోకము ఏకైక తనయుని పంపెను ఈ దినము పశువుల పాకలో ఒదిగేను శిశువుగా అవతరించే నేడు లోక రక్షకునిగా (2) ||రండయ్యో||
deevudu enthagaanoo preeminchi lookamu eekaika thanayuni panpenu ee dinamu pashuvula paakaloo odigeenu shishuvugaa avatharinchee needu looka rakssakunigaa (2) ||randayyoo||
దేవాది దేవుడు మనిషిగా మారిన వేళ శాపాలు పాపాలు రద్దయిన శుభవేళ లోకాల కారకుడు లోకమున పుట్టెను మనిషి మరణము ఆయువు తీరెను
deevaadi deevudu manissigaa maarina veella shaapaalu paapaalu raddayina shubhaveella lookaala kaarakudu lookamuna puttenu manissi marannamu aayuvu theerenu