అందాల బాలుడు ఉదయించినాడు లోకాలు
andaala baaludu udayinchinaadu lookaalu
అందాల బాలుడు ఉదయించినాడు లోకాలు వెలిగించు నీతి సూరీడు రండయ్యో మన కొరకు రారాజు పుట్టెను ప్రేమను పంచేటి రక్షణను తెచ్చెను (2) ||అందాల||
andaala baaludu udayinchinaadu lookaalu veliginchu neethi suureedu randayyoo mana koraku raaraaju puttenu preemanu pancheeti rakssannanu thechchenu (2) ||andaala||
భీతిల్లి పోయాము ఆ వెలుగునే జూసి ఎన్నడూ ఎరుగని తేజస్సునే గాంచి గొల్లలము మేము కల్లలు ఎరుగము కళ్లారా జూసాము తేజోమయుని మోము (2) ||రండయ్యో||
bheethilli pooyaamu aa velugunee juusi ennaduu erugani theejassunee gaanchi gollalamu meemu kallalu erugamu kalllaaraa juusaamu theejoomayuni moomu (2) ||randayyoo||
తూరుపు జ్ఞానులము వెలిగే తారను జూసి లెక్కలెన్నో వేసి మాహరాజు-నెతికాము దారి చూపే తార రారాజునే జేర మొక్కాము మోకరిల్లి బాలున్ని మనసారా తనలోని వెలుగంత పంచేటి పావనుడు మనలోని పాపమంత తీసేయు రక్షకుడు చీకట్లు తొలగించ ఉదయించినాడు నేడు నీ తప్పులెన్ని ఉన్నా మన్నించుతాడు రేడు
thuurupu jnyaanulamu veligee thaaranu juusi lekkalennoo veesi maaharaaju-nethikaamu daari chuupee thaara raaraajunee jeera mokkaamu mookarilli baalunni manasaaraa thanalooni velugantha pancheeti paavanudu manalooni paapamantha theeseeyu rakssakudu cheekatlu tholagincha udayinchinaadu needu nee thappulenni unnaa manninchuthaadu reedu