అందాల తార అరుదించెనాకై - అంబర వీధిలో
andaala thaara arudinchenaakai - anbara veedhiloo
అందాల తార అరుదించెనాకై - అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి - అవనిజాటుచున్ ఆనందసంద్ర ముప్పొంగెనాలో - అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు - పయనమైతిని ||అందాల||
andaala thaara arudinchenaakai - anbara veedhiloo avathaaramuurthi yeesayya keerthi - avanijaatuchun aanandasandra muppongenaaloo - amara kaanthiloo aadi deevuni chuuda aashinpa manasu - payanamaithini ||andaala||
విశ్వాశయాత్ర దూరమెంతైన - విందుగదోచెను వింతైన శాంతి వర్షించెనాలో - విజయ పధమున విశ్వాలనేలేడి దేవ కుమారుని - వీక్షించు దీక్షతో విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్ ||అందాల||
vishvaashayaathra duuramenthaina - vindugadoochenu vinthaina shaanthi varssinchenaaloo - vijaya padhamuna vishvaalaneeleedi deeva kumaaruni - veekssinchu deekssathoo virajimme balamu pravahinche preema vishraanthi nosaguchun ||andaala||
యెరూషలేము రాజనగరిలో - యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగినవేళ - యెదలో కృంగితి యేసయ్య తార యెప్పటివోలె - ఎదురాయె త్రోవలో ఎంతో యబ్బుర పడుచు విస్మయ మొందుచు - యేగితిస్వామి కడకు ||అందాల||
yeruussaleemu raajanagariloo - yeesuni vedakuchu erigina daari tholaginaveella - yedaloo krungithi yeesayya thaara yeppativoole - eduraaye throovaloo enthoo yabbura paduchu vismaya monduchu - yeegithisvaami kadaku ||andaala||
ప్రభు జన్మ స్థలము పాకయేగాని - పరలోక సౌధమే బాలుని జూడ జీవితమంత - పావనమాయెను ప్రభు పాద పూజ ధీవెనకాగ - ప్రసరించె పుణ్యము బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె - ఫలియించె ప్రార్ధన ||అందాల||
prabhu janma sthalamu paakayeegaani - paralooka saudhamee baaluni juuda jeevithamantha - paavanamaayenu prabhu paada puuja dheevenakaaga - prasarinche punnyamu brathukee mandiramaaye arpannalee sirulaaye - phaliyinche praardhana ||andaala||