అందమైన క్షణము ఆనందమయము యేసయ్య
andamaina kssannamu aanandamayamu yeesayya
అందమైన క్షణము ఆనందమయము యేసయ్య పుట్టినవేళ సంబరమే సంబరము (2) బంగారు సొగసు కన్నా బహు అందగాడు బోళము సాంబ్రాణి కన్నా బహు సుగంధుడు సంబరమే సంబరము శ్రీ యేసు జననము సర్వ జగతికి మహా సంతోషము సర్వ సృష్టికి ముందే దేవుడేర్పరిచిన శాశ్వత జీవం ఈ ప్రభు యేసే బలమైన యోధుడు దేవాది దేవుడు దీన నరుడై మనకై పుట్టాడు మన గాయములకు కట్టు కట్టి మన బ్రతుకులను వెలుగుతో నింపిన దైవతనయుని కొలువ రావా సందేహించకు ఓ సోదరా రక్షణ మార్గము కోరి రావా సంశయమెందుకు ఓ సోదరా… ఓ సోదరీ… ||సంబరమే||
andamaina kssannamu aanandamayamu yeesayya puttinaveella sanbaramee sanbaramu (2) bangaaru sogasu kannaa bahu andagaadu boollamu saanbraanni kannaa bahu sugandhudu sanbaramee sanbaramu shree yeesu jananamu sarva jagathiki mahaa santhoossamu sarva srusstiki mundee deevudeerparichina shaashvatha jeevam ee prabhu yeesee balamaina yoodhudu deevaadi deevudu deena narudai manakai puttaadu mana gaayamulaku kattu katti mana brathukulanu veluguthoo ninpina daivathanayuni koluva raavaa sandeehinchaku oo soodaraa rakssanna maargamu koori raavaa sanshayamenduku oo soodaraa… oo soodaree… ||sanbaramee||
పాప విమోచన నిత్య జీవం సిలువలోనే మనకు సాధ్యం సిలువ భారం తాను మోసి మన దోషములను తుడిచేసాడు సిలువ చెంతకు చేర రావా జాగు ఎందుకు ఓ సోదరా యేసు నామము నమ్మ రావా జాగు ఎందుకు ఓ సోదరా… ఓ సోదరీ…
paapa vimoochana nithya jeevam siluvaloonee manaku saadhyam siluva bhaaram thaanu moosi mana doossamulanu thudicheesaadu siluva chenthaku cheera raavaa jaagu enduku oo soodaraa yeesu naamamu namma raavaa jaagu enduku oo soodaraa… oo soodaree…