అంధకార చెరసాలలో – బంధకాల
andhakaara cherasaalaloo – bandhakaala
అంధకార చెరసాలలో – బంధకాల ఇరుకులో పౌలు సీలలు ప్రార్ధించిరి – కీర్తనలు పాడిరి – (2) భూమియే కంపించెను – చెరసాల అదిరెను వారి సంకెళ్లు ఊడిపోయెను – విడుదల దొరికెను – వ్యాధులు ఆవరించగా – మరణము తరుముచుండగా రండి పారి పోదుము – ఇంక దాగి యుందుము ఏ తెగులు దరిచేరని – ఏ దిగులు ఉండని మన దాగు స్థలములో – యేసుని సన్నిధిలో ||అంధకార||
andhakaara cherasaalaloo – bandhakaala irukuloo paulu seelalu praardhinchiri – keerthanalu paadiri – (2) bhuumiyee kanpinchenu – cherasaala adirenu vaari sankelllu uudipooyenu – vidudala dorikenu – vyaadhulu aavarinchagaa – marannamu tharumuchundagaa randi paari poodumu – inka daagi yundumu ee thegulu daricheerani – ee digulu undani mana daagu sthalamuloo – yeesuni sannidhiloo ||andhakaara||
ప్రార్ధన చేసెదము – దేవుని సముఖములో ఈ శోధన సమయములో – విరిగిన హృదయముతో ఈ లోక రక్షణకై – జనముల స్వస్థతకై యేసుని వేడెదము – శోకము తొలగించమని మొరలను ఆలకించును – యేసు మనలను విడిపించును ఈ లోకమును శుద్ధిచేయును – మరణమును తప్పించును మన రక్షణ వలయముగా – తన రెక్కలు చాపును దుఃఖమును సంతోషముగా – మార్చివేయును త్వరలో
praardhana cheesedamu – deevuni samukhamuloo ee shoodhana samayamuloo – virigina hrudayamuthoo ee looka rakssannakai – janamula svasthathakai yeesuni veededamu – shookamu tholaginchamani moralanu aalakinchunu – yeesu manalanu vidipinchunu ee lookamunu shuddhicheeyunu – marannamunu thappinchunu mana rakssanna valayamugaa – thana rekkalu chaapunu duhkhamunu santhoossamugaa – maarchiveeyunu thvaraloo