అంటరాని వాడవంటు నన్ను ఊరు
antaraani vaadavantu nannu uuru
అంటరాని వాడవంటు నన్ను ఊరు బైటకు త్రోసి వేసిరి దేహమంతా కుళ్లిపోయి – దుర్వాసనతో నిండిపోయే అయిన వారు కానరాక – భుజము తట్టే వారు లేక కంటి నిండా నిదుర పొక – ఒంటరిగ జీవించలేక మరణమును బ్రతిమాలుకున్నా… మరణమును బ్రతిమాలుకున్నా – అదియు నన్ను ముట్టలేదు చావలేక బ్రతుకలేక విసికిపోయాను – నేను అలసిపోయాను నీ దరికి చేరాను – నిన్నే నమ్ముకున్నాను యేసు.. యేసు.. యేసు నా తట్టు తిరగవా యేసు.. యేసు.. యేసు నా గోడు వినవా ||అంటరాని||
antaraani vaadavantu nannu uuru baitaku throosi veesiri deehamanthaa kulllipooyi – durvaasanathoo nindipooyee ayina vaaru kaanaraaka – bhujamu thattee vaaru leeka kanti nindaa nidura poka – ontariga jeevinchaleeka marannamunu brathimaalukunnaa… marannamunu brathimaalukunnaa – adiyu nannu muttaleedu chaavaleeka brathukaleeka visikipooyaanu – neenu alasipooyaanu nee dariki cheeraanu – ninnee nammukunnaanu yeesu.. yeesu.. yeesu naa thattu thiragavaa yeesu.. yeesu.. yeesu naa goodu vinavaa ||antaraani||
నిలిచిపోయావు నా కేక వినగానే కదలిపోయావు నా స్థితిని చూడగనే నీ కడుపులోని దుఖమును నీ ముఖముపై చూసి నేను కరిగిపోయాను నీ కనికరము చూసి – కన్నీటితో తడిసిపోయాను యేసు.. యేసు.. యేసు నీకెంత జాలి చాలు.. చాలు.. చాలు నీ దయయే చాలు నన్ను తాకావు నీ చేతులను చాపి కుష్టు రోగము నా దేహము పైన ఉండగనే నా గుండె లోపల మండుచున్న కోరికను చూసి నన్ను ముట్టుకున్నావు ఆ స్పర్శకొరకే కదా నే తపియించి పోయాను యేసు.. యేసు.. యేసు నీలా ఉందురెవరు చాలు.. చాలు.. చాలు నీ స్పర్శ చాలు స్వస్థపరిచావు శుద్దునిగా చేసావు మురికి కూపము నుండి నన్ను లేవనెత్తావు నా తలను పైకెత్తుకొని బ్రతికే తరుణమిచ్చావు నాకు బ్రతుకు నిచ్చావు నిను ఆశ్రయించి నిరాశచెందు నరులు ఎవ్వరు యేసు.. యేసు.. యేసు దండములు నీకు చాలు.. చాలు.. నాకింక నీవే చాలు
nilichipooyaavu naa keeka vinagaanee kadalipooyaavu naa sthithini chuudaganee nee kadupulooni dukhamunu nee mukhamupai chuusi neenu karigipooyaanu nee kanikaramu chuusi – kanneetithoo thadisipooyaanu yeesu.. yeesu.. yeesu neekentha jaali chaalu.. chaalu.. chaalu nee dayayee chaalu nannu thaakaavu nee cheethulanu chaapi kusstu roogamu naa deehamu paina undaganee naa gunde loopala manduchunna koorikanu chuusi nannu muttukunnaavu aa sparshakorakee kadaa nee thapiyinchi pooyaanu yeesu.. yeesu.. yeesu neelaa undurevaru chaalu.. chaalu.. chaalu nee sparsha chaalu svasthaparichaavu shuddunigaa cheesaavu muriki kuupamu nundi nannu leevaneththaavu naa thalanu paikeththukoni brathikee tharunnamichchaavu naaku brathuku nichchaavu ninu aashrayinchi niraashachendu narulu evvaru yeesu.. yeesu.. yeesu dandamulu neeku chaalu.. chaalu.. naakinka neevee chaalu