అంతే లేని నీ ప్రేమ
anthee leeni nee preema
అంతే లేని నీ ప్రేమ ధార ఎంతో నాపై కురిపించినావు వింతైన నీ ప్రేమ కొంతైన గాని కాంతింప కృప నాకు చూపించినావు (2) ఎంతో ఎంతో నీ ప్రేమ ఎంతో పొందేటందుకు నే యోగ్యుడను (యోగ్యురాలు) కాను అంతో ఇంతో ఆ ప్రేమను నేను పంచేటందుకు నీ భాగ్యము పొందాను ||అంతే||
anthee leeni nee preema dhaara enthoo naapai kuripinchinaavu vinthaina nee preema konthaina gaani kaanthinpa krupa naaku chuupinchinaavu (2) enthoo enthoo nee preema enthoo pondeetanduku nee yoogyudanu (yoogyuraalu) kaanu anthoo inthoo aa preemanu neenu pancheetanduku nee bhaagyamu pondaanu ||anthee||
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దూతలతో పొగడబడే దేవా పదివేలలో అతి సుందరుడా నీవేగా అతి కాంక్షనీయుడా నా దోషములకై ఆ కలువరి సిలువలో బలియాగమైనావ దేవా సొంతముగా నే చేసిన నా పాపములన్ని శాంతముతో సహియించి క్షమియించినావు పంతముతో నిను వీడి నే పారిపోగా నీ రాజ్యమునకు చేర్చగ వంతెన అయినావు ఏమున్నదీ నాలో దేవా మంచన్నదే లేనే లేదు అయినా నీవు నను రక్షించి నీ సాక్షిగ నిలిపావు ఇలలో అర్హతయే లేదు నీ పేరు పిలువ నీ సొత్తుగా నను మార్చినావా ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు బదులు నా జీవితమంతయును నీ కొరకే దేవా నీ సేవలో నేను కొనసాగెదనయ్యా ప్రకటింతు నీ ప్రేమ తుది శ్వాస వరకు
parishuddhudu parishuddhudu ani duuthalathoo pogadabadee deevaa padiveelaloo athi sundarudaa neeveegaa athi kaankssaneeyudaa naa doossamulakai aa kaluvari siluvaloo baliyaagamainaava deevaa sonthamugaa nee cheesina naa paapamulanni shaanthamuthoo sahiyinchi kssamiyinchinaavu panthamuthoo ninu veedi nee paaripoogaa nee raajyamunaku cheerchaga vanthena ayinaavu eemunnadee naaloo deevaa manchannadee leenee leedu ayinaa neevu nanu rakssinchi nee saakssiga nilipaavu ilaloo arhathayee leedu nee peeru piluva nee soththugaa nanu maarchinaavaa eemivvagalanayyaa nee preemaku badulu naa jeevithamanthayunu nee korakee deevaa nee seevaloo neenu konasaagedanayyaa prakatinthu nee preema thudi shvaasa varaku