అంత్య దినములయందు ఆత్మను మనుష్యులందరి
anthya dinamulayandu aathmanu manussyulandari
అంత్య దినములయందు ఆత్మను మనుష్యులందరి మీద కుమ్మరించుమయా (2) దేవా యవ్వనులకు దర్శనము కలుగజేయుము (2) ||అంత్య||
anthya dinamulayandu aathmanu manussyulandari meeda kummarinchumayaa (2) deevaa yavvanulaku darshanamu kalugajeeyumu (2) ||anthya||
కోతెంతో విస్తారము కోసేడి వారు లేరు యవ్వనులకు నీ పిలుపునిచ్చి సేవకు తరలింపుము (2) ||దేవా||
koothenthoo visthaaramu kooseedi vaaru leeru yavvanulaku nee pilupunichchi seevaku tharalinpumu (2) ||deevaa||
సౌలు లాంటి యవ్వనులు దమస్కు మార్గము వెళ్లుచుండగా నీ దర్శనము వారికిచ్చి పౌలు వలె మార్చుము సంసోను లాంటి యవ్వనులు బలమును వ్యర్ధ పరచుచుండగా నీ ఆత్మ బలమును వారికిచ్చి నీ దాసులుగా మార్చుము
saulu laanti yavvanulu damasku maargamu vellluchundagaa nee darshanamu vaarikichchi paulu vale maarchumu sansoonu laanti yavvanulu balamunu vyardha parachuchundagaa nee aathma balamunu vaarikichchi nee daasulugaa maarchumu