అవనిలో ఉద్భవించె ఆది సంభూతిని
avaniloo udbhavinche aadi sanbhuuthini
అవనిలో ఉద్భవించె ఆది సంభూతిని చూడరే పుడమియే పరవశించె పసిబాలుని చూడగనే… పసిబాలుని చూడగనే ఆకాశమే పట్టనోడు – ధరణిలో పుట్టినాడు దావీదు పురమునందు దీనుడై – వెలసినాడు రక్షకుడు (2) ఆనందమే మహా ఆనందమే – అందరికి ఇలలో సంతోషమే ఆశ్చర్యమే ఇది అద్భుతమే – యేసు జననం అద్భుతమే అదృశ్య దేవుని మహిమ స్వరూపుడు ఆది అంతమైన పరలోక నాథుడు ఆదియందు వాక్యంబుగా – సృష్టి కార్యము జరిగించినాడు అనాది నుండి జ్ఞానంబుగా – సృష్టి క్రమము నడిపించినాడు అన్నిటిని కలిగించిన మహరాజు కన్నీటిని తుడచుటకు దిగివచ్చినాడు (2) ||ఆనందమే||
avaniloo udbhavinche aadi sanbhuuthini chuudaree pudamiyee paravashinche pasibaaluni chuudaganee… pasibaaluni chuudaganee aakaashamee pattanoodu – dharanniloo puttinaadu daaveedu puramunandu deenudai – velasinaadu rakssakudu (2) aanandamee mahaa aanandamee – andariki ilaloo santhoossamee aashcharyamee idi adbhuthamee – yeesu jananam adbhuthamee adrushya deevuni mahima svaruupudu aadi anthamaina paralooka naathudu aadiyandu vaakyanbugaa – srussti kaaryamu jariginchinaadu anaadi nundi jnyaananbugaa – srussti kramamu nadipinchinaadu annitini kaliginchina maharaaju kanneetini thudachutaku digivachchinaadu (2) ||aanandamee||
ప్రేమను పంచే ప్రేమామయుడు రక్షణ ఇచ్చే రక్షించే దేవుడు పాపమే లేని సుగుణాల సుందరుడు శాపము బాపను జన్మించెను చూడు నిత్యముండు నీతి సూర్యుడు – సత్యసాక్షిగా ఇలకొచ్చినాడు ప్రేమను పంచే పావనాత్ముడు – పశుల పాకలో పవళించినాడు సర్వాధికారియైన మహరాజు దీనులకు దీవెనగా దిగి వచ్చినాడు (2) ||ఆనందమే||
preemanu panchee preemaamayudu rakssanna ichchee rakssinchee deevudu paapamee leeni sugunnaala sundarudu shaapamu baapanu janminchenu chuudu nithyamundu neethi suuryudu – sathyasaakssigaa ilakochchinaadu preemanu panchee paavanaathmudu – pashula paakaloo pavallinchinaadu sarvaadhikaariyaina maharaaju deenulaku deevenagaa digi vachchinaadu (2) ||aanandamee||
||ఆకాశమే||
||aakaashamee||