బాల యేసుని జన్మ దినం

baala yeesuni janma dinam

🎵 TG-2822🌐 Telugu
పల్లవి

బాల యేసుని జన్మ దినం వేడుకైన శుభ దినము సేవింప రారే జనులారా ముద్దుల బాలకు ముద్దులిడ ||బాల||

1వ చరణం

మరియమ్మ ఒడిలో ఆడెడి బాలుని చిన్నారి చిరునవ్వు లొలికెడి బాలుని (2) చేకొని లాలింప రారే జో జోల పాటలు పాడి పాపికి పరమ మార్గము జూప ఏతెంచి ప్రభువు నరునిగా ఇలకు పశుశాలయందు పవళించే తమ ప్రేమను జూపింప మనకు మన జోల పాటలు ఆలించు బాలుడు దేవాది దేవుని తనయుడు గనుక వరముల నొసగి మనకు దేవుని ప్రియులుగా జేయు

Report Error