భారత దేశపు క్రీస్తు (సువార్త) సంఘమా - భువి దివి సంఘమా
bhaaratha deeshapu kreesthu (suvaartha) sanghamaa - bhuvi divi sanghamaa
భారత దేశపు క్రీస్తు (సువార్త) సంఘమా - భువి దివి సంఘమా ధర సాతానుని రాజ్యము కూల్చే - యుద్ధా రంగమా ||భారత||
bhaaratha deeshapu kreesthu (suvaartha) sanghamaa - bhuvi divi sanghamaa dhara saathaanuni raajyamu kuulchee - yuddhaa rangamaa ||bhaaratha||
ఎవని పంపుదును నా తరపున - ఇల ఎవరు పోవుదురు నాకై నేనున్నాను నన్ను పంపమని - రమ్మూ సంఘమా భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా ||భారత||
evani panpudunu naa tharapuna - ila evaru poovuduru naakai neenunnaanu nannu panpamani - rammuu sanghamaa bhaaratha deeshamuloo veligee kreesthu sanghamaa ||bhaaratha||
అడవి ప్రాంతములు, ఎడారి భూములు - ద్వీపవాసులను గనుమా అంధకార ప్రాంతములో ప్రభుని - జ్యోతిని వెలిగించను కనుమా భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా ||భారత||
adavi praanthamulu, edaari bhuumulu - dveepavaasulanu ganumaa andhakaara praanthamuloo prabhuni - jyoothini veliginchanu kanumaa bhaaratha deeshamuloo veligee kreesthu sanghamaa ||bhaaratha||
బ్రతుకులోన ప్రభు శక్తిలేని - క్రైస్తవ జనాంగమును గనుమా కునుకు దివ్వెలను సరిచేయగ - ఉజ్జీవ జ్వాలగొని చనుమా భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా ||భారత||
brathukuloona prabhu shakthileeni - kraisthava janaangamunu ganumaa kunuku divvelanu saricheeyaga - ujjeeva jvaalagoni chanumaa bhaaratha deeshamuloo veligee kreesthu sanghamaa ||bhaaratha||