భయము లేదు - దిగులు లేదు - జీవిత యాత్రలో
bhayamu leedu - digulu leedu - jeevitha yaathraloo
భయము లేదు - దిగులు లేదు - జీవిత యాత్రలో యేసు ప్రభువు - మనతోనుండ - భయము లేదుగా హల్లేలూయ - హల్లేలూయ (2) ||భయము లేదు ||
bhayamu leedu - digulu leedu - jeevitha yaathraloo yeesu prabhuvu - manathoonunda - bhayamu leedugaa halleeluuya - halleeluuya (2) ||bhayamu leedu ||
గాలి తుఫాను రేగి అలలు పొంగినా విశ్వాస నావ మునిగి కొట్టబడిన సముద్రము పొంగి - నురుగు కట్టిన యేసు ప్రభువు మనతోనుండ భయము లేదుగా (2) ||భయము లేదు||
gaali thuphaanu reegi alalu ponginaa vishvaasa naava munigi kottabadina samudramu pongi - nurugu kattina yeesu prabhuvu manathoonunda bhayamu leedugaa (2) ||bhayamu leedu||
వ్యాధి భాధలు నన్ను ముట్టినా అంతులేని వేదనా నాకు కల్గిన గర్జించు సింహము - ఎదురు వచ్చిన యేసు ప్రభువు మనతోనుండ భయము లేదుగా (2) ||భయము లేదు||
vyaadhi bhaadhalu nannu muttinaa anthuleeni veedanaa naaku kalgina garjinchu sinhamu - eduru vachchina yeesu prabhuvu manathoonunda bhayamu leedugaa (2) ||bhayamu leedu||
శత్రువున్ చూచి విస్మయమొందకు నీతో కూడా వచ్చువాడు నీదేవుడే నిన్ను విడువడెన్నడు ఎడబాయడు యేసు ప్రభువు మనతోనుండ భయము లేదుగా (2) ||భయము లేదు||
shathruvun chuuchi vismayamondaku neethoo kuudaa vachchuvaadu needeevudee ninnu viduvadennadu edabaayadu yeesu prabhuvu manathoonunda bhayamu leedugaa (2) ||bhayamu leedu||