భూమియు దాని సంపూర్ణత లోకము
bhuumiyu daani sanpuurnnatha lookamu
భూమియు దాని సంపూర్ణత లోకము దాని నివాసు లెహోవావే (2) ఆయన సముద్రము మీద దానికి పునాది వేసెను ప్రవాహజలముల మీద దానిని స్థిరపరచెను (2) ||భూమియు||
bhuumiyu daani sanpuurnnatha lookamu daani nivaasu lehoovaavee (2) aayana samudramu meeda daaniki punaadi veesenu pravaahajalamula meeda daanini sthiraparachenu (2) ||bhuumiyu||
యెహోవా పర్వతమునకు నెక్కదగిన వాడెవ్వడు యెహోవా పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవ్వడు వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు నిర్దోషచేతులు శుద్ధ హృదయము కలిగినవాడే నిన్నాశ్రయించి నీ సన్నిధిని వెదకెడి వాడు వాడాశీర్వాదము నీతి మత్వము నొందును గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి మహిమగల యీ రాజెవడు? బలశౌర్యముగల ప్రభువే యుద్ధశూరుడైన యెహోవా పరాక్రమముగల ప్రభువే మహిమగల యీ రాజెవడు? సైన్యముల యెహోవాయే ఆయనే యీ మహిమగల రాజు హల్లెలూయా ఆమెన్
yehoovaa parvathamunaku nekkadagina vaadevvadu yehoovaa parishuddha sthalamuloo niluvadagina vaadevvadu vyarthamaina daaniyandu manassu pettakayu nirdoossacheethulu shuddha hrudayamu kaliginavaadee ninnaashrayinchi nee sannidhini vedakedi vaadu vaadaasheervaadamu neethi mathvamu nondunu gummamulaaraa mee thalalu paikeththudi puraathanamaina thalupulaaraa mahimagala raaju praveeshinchunatlu mimmunu leevaneththikonudi mahimagala yee raajevadu? balashauryamugala prabhuvee yuddhashuurudaina yehoovaa paraakramamugala prabhuvee mahimagala yee raajevadu? sainyamula yehoovaayee aayanee yee mahimagala raaju halleluuyaa aamen