భూమ్యాకాశములను సృజియించిన దేవా నీ
bhuumyaakaashamulanu srujiyinchina deevaa nee
భూమ్యాకాశములను సృజియించిన దేవా నీ సన్నిధిలోనే ప్రవేశించెదను నీ పరిశుద్ధతను ప్రకాశించుటకు నీ పరిపూర్ణతలో నన్ను నడిపించుము మహిమా నీకే… ఘనతా నీకే… ప్రతి దినం నా ఆరాధన నీకే నిరంతరం ఈ స్తోత్రార్పణ నీకే యేసయ్యా.. నీకే వందనం – (4) మట్టి ముద్దనైన నన్ను మనిషిగా రూపించావు వట్టి వాడనైన గాని మహిమతో నను నింపావు (2) నీ కౌగిలిలో నను హత్తుకొని అర చేతులలో నను చెక్కుకొని నీ సన్నిధి కాంతిని నాపైనే ఉదయింపజేసావు ఏమివ్వగలను నేను నీ ప్రేమకై పగిలిన హృదయముతో ఆరాధింతును ||మహిమా||
bhuumyaakaashamulanu srujiyinchina deevaa nee sannidhiloonee praveeshinchedanu nee parishuddhathanu prakaashinchutaku nee paripuurnnathaloo nannu nadipinchumu mahimaa neekee… ghanathaa neekee… prathi dinam naa aaraadhana neekee nirantharam ee sthoothraarpanna neekee yeesayyaa.. neekee vandanam – (4) matti muddanaina nannu manissigaa ruupinchaavu vatti vaadanaina gaani mahimathoo nanu ninpaavu (2) nee kaugililoo nanu haththukoni ara cheethulaloo nanu chekkukoni nee sannidhi kaanthini naapainee udayinpajeesaavu eemivvagalanu neenu nee preemakai pagilina hrudayamuthoo aaraadhinthunu ||mahimaa||
ఘోర పాపినైన నన్ను ఎంతగా ప్రేమించావు సిలువ పైన ప్రాణమిచ్చి వింతగా నను మార్చావు నా మనో నేత్రమును వెలిగించి నా హృదయ కాఠిన్యమును మార్చి అర్హతే లేని బలహీనుడనే ఎన్నుకున్నావు ఏమిచ్చి నీ ఋణమును నే తీర్తును విరిగి నలిగిన మనస్సుతో ఆరాధింతును
ghoora paapinaina nannu enthagaa preeminchaavu siluva paina praannamichchi vinthagaa nanu maarchaavu naa manoo neethramunu veliginchi naa hrudaya kaatthinyamunu maarchi arhathee leeni balaheenudanee ennukunnaavu eemichchi nee runnamunu nee theerthunu virigi naligina manassuthoo aaraadhinthunu