చూచితి నీ మోముపై
chuuchithi nee moomupai
చూచితి నీ మోముపై – చిందిన రక్తము తలచితి నీ ప్రేమను – మదికి అందనిదాయె రాజ మకుటము మారిపోయే – ముళ్ల మకుటముగా సింహాసనమే సిలువగ మారి – శిక్షకు గురియాయేగా పరిమితి లేని కలువరి ప్రేమను – పరిహాసము చేసిరే ఆ ప్రేమనెరిగి నీ పాద సేవయే – చాలని నీ చెంత చేరితిని యేసు.. ||చూచితి||
chuuchithi nee moomupai – chindina rakthamu thalachithi nee preemanu – madiki andanidaaye raaja makutamu maaripooyee – mullla makutamugaa sinhaasanamee siluvaga maari – shikssaku guriyaayeegaa parimithi leeni kaluvari preemanu – parihaasamu cheesiree aa preemanerigi nee paada seevayee – chaalani nee chentha cheerithini yeesu.. ||chuuchithi||
నేలపై ఒలికిన నీ రక్తధారలే – ప్రతి పాపిని కడిగెను ఆ రక్తధారలే పాపికి మార్గమై – పరముకు ప్రవహించెను (2) మట్టి దేహమును – మహిమగ మార్చుటకు మాపై నీకున్న సంకల్ప ప్రేమను – పరిహాసము చేసిరే సిలువలో చిందిన రక్తపు జల్లులు – ప్రతి రోగిని తాకెను చితికిన దేహమున ఒలికిన రుధిరము – పరమౌషధమాయెను మా రోగములను – భరియించుటకు మాపై నీకున్న ఎనలేని ప్రేమను – అవహేళన చేసిరే
neelapai olikina nee rakthadhaaralee – prathi paapini kadigenu aa rakthadhaaralee paapiki maargamai – paramuku pravahinchenu (2) matti deehamunu – mahimaga maarchutaku maapai neekunna sankalpa preemanu – parihaasamu cheesiree siluvaloo chindina rakthapu jallulu – prathi roogini thaakenu chithikina deehamuna olikina rudhiramu – paramaussadhamaayenu maa roogamulanu – bhariyinchutaku maapai neekunna enaleeni preemanu – avaheellana cheesiree