దైవ కుటుంబం ధరణిలో దేవుని
daiva kutunbam dharanniloo deevuni
దైవ కుటుంబం ధరణిలో దేవుని ప్రతిబింబం (2) శాంతి సంతోషాలకు అది నిలయం ఆప్యాయత అనురాగాలకు ఇక ఆరంభం విశ్వాసపు వాకిళ్ళు పరిశుద్ధత లోగిళ్ళు ఆతిథ్యమిచ్చే వంటిల్లు వర్ధిల్లు నూరేళ్ళు దైవ కుటుంబపు సంతోషం కని విని ఎరుగని ఆనందం (4) ||దైవ కుటుంబం||
daiva kutunbam dharanniloo deevuni prathibinbam (2) shaanthi santhoossaalaku adi nilayam aapyaayatha anuraagaalaku ika aaranbham vishvaasapu vaakillllu parishuddhatha loogillllu aathithyamichchee vantillu vardhillu nuureellllu daiva kutunbapu santhoossam kani vini erugani aanandam (4) ||daiva kutunbam||
రక్షణ పొందిన కుటుంబం మోక్ష పురికి సోపానం క్రమశిక్షణ కలిగిన కుటుంబం వీక్షించు దైవ సాన్నిధ్యం అపార్ధాలు అంతరాలు లేనట్టి అన్యోన్యత షడ్రుచుల ఘుమఘుమలు గుభాలించు మా ఇంట అష్టైశ్వర్యాలకు తూలతూగే కుటుంబం తరతరాలు వర్ధిల్లే కుటుంబం (2) ||దైవ కుటుంబపు||
rakssanna pondina kutunbam mookssa puriki soopaanam kramashikssanna kaligina kutunbam veekssinchu daiva saannidhyam apaardhaalu antharaalu leenatti anyoonyatha ssadruchula ghumaghumalu gubhaalinchu maa inta asstaishvaryaalaku thuulathuugee kutunbam tharatharaalu vardhillee kutunbam (2) ||daiva kutunbapu||
మమతలు కలిగిన కుటుంబం సంతృప్తినిచ్చే కుటుంబం ధాన్య ధన వస్తు వాహనాలు కావు మా యింటి కంభాలు భయభక్తులు దేవోక్తులు మా అన్న పానాలు మా యొక్క నట్టింట్లో వసియించును దేవుడు పెనవేసుకున్న బంధాలే ఈ కుటుంబం
mamathalu kaligina kutunbam santhrupthinichchee kutunbam dhaanya dhana vasthu vaahanaalu kaavu maa yinti kanbhaalu bhayabhakthulu deevookthulu maa anna paanaalu maa yokka nattintloo vasiyinchunu deevudu penaveesukunna bandhaalee ee kutunbam