దేవా చెవియొగ్గుము.. దృష్టించుము.. నిన్నే
deevaa cheviyoggumu.. drusstinchumu.. ninnee
దేవా చెవియొగ్గుము.. దృష్టించుము.. నిన్నే వెదకుచున్నాను దేవా సెలవియ్యుము.. బదులీయము.. నిన్నే వేడుచున్నాను ప్రతి ఉదయం – నిను నమ్మి ప్రతి రాత్రి – నిను వేడి ప్రతి ఘడియ – నిను కోరి.. నహాళ్ ఆశతో వేచి ఉన్నా – నీవే నా నమ్మకం ఓర్పుతో కాచి ఉన్నా – నీవేగా నా ధైర్యం ఎల్ షమా నా ప్రార్ధన వినువాడా ఎండిన భూమి వలె క్షీణించుచున్నాను ( వేచి వేచి యున్నాను నీ తట్టు నా కరముల్ నే చాపుచున్నాను ఆత్మవర్షం నాపైన కురిపించుము ప్రభు పోగొట్టుకున్నవి మరలా దయ చేయుము ఆత్మ వర్షం కురిపించి నను బ్రతికించుము నీ చిత్తము నెరవేర్చి సమకూర్చుము ప్రభు ||ఎల్ షమా||
deevaa cheviyoggumu.. drusstinchumu.. ninnee vedakuchunnaanu deevaa selaviyyumu.. baduleeyamu.. ninnee veeduchunnaanu prathi udayam – ninu nammi prathi raathri – ninu veedi prathi ghadiya – ninu koori.. nahaall aashathoo veechi unnaa – neevee naa nammakam oorputhoo kaachi unnaa – neeveegaa naa dhairyam el ssamaa naa praardhana vinuvaadaa endina bhuumi vale ksseenninchuchunnaanu ( veechi veechi yunnaanu nee thattu naa karamul nee chaapuchunnaanu aathmavarssam naapaina kuripinchumu prabhu poogottukunnavi maralaa daya cheeyumu aathma varssam kuripinchi nanu brathikinchumu nee chiththamu neraveerchi samakuurchumu prabhu ||el ssamaa||
విడిచిపెట్టకు ప్రభు ప్రయత్నిస్తున్నాను అడుగడుగు నా తోడై ఒడ్డుకు నను చేర్చవా యెహోవా నా దేవా నీవే నాకున్నది బాధలో ఔషధం నీ ప్రేమే కదా (2) ||ఎల్ షమా||
vidichipettaku prabhu prayathnisthunnaanu adugadugu naa thoodai odduku nanu cheerchavaa yehoovaa naa deevaa neevee naakunnadi baadhaloo aussadham nee preemee kadaa (2) ||el ssamaa||
నీ శక్తియే విడిపించును నీ హస్తమే లేవనెత్తును నీ మాటయే నా బలము నీ మార్గము పరిశుద్ధము
nee shakthiyee vidipinchunu nee hasthamee leevaneththunu nee maatayee naa balamu nee maargamu parishuddhamu