దేవాది దేవుడు మహోపకారుడు మహాత్యము
deevaadi deevudu mahoopakaarudu mahaathyamu
దేవాది దేవుడు మహోపకారుడు మహాత్యము గల మహారాజు (2) ప్రభువుల ప్రభువు – రాజుల రాజు ఆయన కృప నిరంతరముండును ||దేవాది||
deevaadi deevudu mahoopakaarudu mahaathyamu gala mahaaraaju (2) prabhuvula prabhuvu – raajula raaju aayana krupa nirantharamundunu ||deevaadi||
సునాద వత్సరము ఉత్సాహ సునాదము నూతన సహస్రాబ్ది నూతన శతాబ్దము ఉత్తమ దేవుని దానములు (2) ||దేవాది||
sunaada vathsaramu uthsaaha sunaadamu nuuthana sahasraabdi nuuthana shathaabdamu uththama deevuni daanamulu (2) ||deevaadi||
యుగములకు దేవుడవు ఉన్నవాడవనువాడవు జగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే నీదు క్రియలు ఘనమైనవి అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసు క్రీస్తు మహిమా మహాత్యములు సర్వాధిపత్యమును సదా నీకే కలుగును గాక
yugamulaku deevudavu unnavaadavanuvaadavu jagamanthaa eeluchunna jeevaadhipathi neevee needu kriyalu ghanamainavi advitheeya deevudavu prabhuvaina yeesu kreesthu mahimaa mahaathyamulu sarvaadhipathyamunu sadaa neekee kalugunu gaaka