దీవించావే సమృద్ధిగా – నీ సాక్షిగా కొనసాగమని

deevinchaavee samruddhigaa – nee saakshigaa konasaagamani

🎵 TG-2041🎤 Bro.Suhaas Prince🌐 Telugu
పల్లవి

దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని దారులలో ఎడారులలో - సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో- అగ్ని స్తంభమై నను నడుపుమయా..||దీవించావే||

1వ చరణం

నువ్వే లేకుండా – నేనుండలేను యేసయ్య నీ ప్రేమే లేకుండా - జీవించలేను నేనయ్య నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో - నా తోడై వున్నావే (2) ఊహలలో నా ఊసులలో - నా ధ్యాస బాసవైనావే శుద్ధతలో పరిశుద్ధతలో - నిను పోలి నన్నిల సాగమని ||దీవించావే||

2వ చరణం

కొలతే లేదయ్యా - నీ జాలి నాపై యేసయ్య కొరతే లేదయ్యా – సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే - కన్న తల్లిలా కొదువంతా తీర్చావే - కన్న తండ్రిలా (2) ఆశలలో నిరాశలలో – నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగా నిలిచావే ||దీవించావే||

Report Error