ధన్యము ఎంతో ధన్యము - యేసయ్యను కలిగిన జీవితము
dhanyamu enthoo dhanyamu - yeesayyanu kaligina jeevithamu
ధన్యము ఎంతో ధన్యము - యేసయ్యను కలిగిన జీవితము ఇహమందున,పరమందున - నూరు రెట్లు ఫలముండును వారె ధన్యులు - వారెంతో ధన్యులు (2)
dhanyamu enthoo dhanyamu - yeesayyanu kaligina jeevithamu ihamanduna,paramanduna - nuuru retlu phalamundunu vaare dhanyulu - vaarenthoo dhanyulu (2)
ఎవరి అతిక్రమములు - పరిహరింపబడెనో ఎవరి పాపములు - మన్నించబడెనో ||వారెధన్యులు||
evari athikramamulu - pariharinpabadenoo evari paapamulu - manninchabadenoo ||vaaredhanyulu||
క్రీస్తు యేసుకు సమర్పించు - కరములే కరములు క్రీస్తుయేసు స్వరము విను - వీనులే వీనులు ||వారెధన్యులు||
kreesthu yeesuku samarpinchu - karamulee karamulu kreesthuyeesu svaramu vinu - veenulee veenulu ||vaaredhanyulu||
ప్రభు యేసుని సేవచేయు - పాదములే సుందరములు ప్రభుని గూర్చి పాటపాడు - పెదవులే పెదవులు ||వారెధన్యులు||
prabhu yeesuni seevacheeyu - paadamulee sundaramulu prabhuni guurchi paatapaadu - pedavulee pedavulu ||vaaredhanyulu||
ఆత్మలో నిత్యము - ఎదుగుచున్న వారును అపవాది తంత్రములు - గుర్తించు వారును ||వారెధన్యులు||
aathmaloo nithyamu - eduguchunna vaarunu apavaadi thanthramulu - gurthinchu vaarunu ||vaaredhanyulu||
శ్రమలయందు నిలచి - పాడుచున్న వారును శత్రు భాణములెల్ల - చెదరగొట్టు వారును ||వారెధన్యులు||
shramalayandu nilachi - paaduchunna vaarunu shathru bhaannamulella - chedaragottu vaarunu ||vaaredhanyulu||