ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన
dhyaaninchuchuntimi siluvapai palikina
ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన – విలువైన నీ మాటలు ప్రాణాత్మలను సేదదీర్చు జీవ ఊటలు (2) మోక్షమునకు చేర్చు బాటలు పరిశుద్ధతలో పరిపూర్ణుడా – ఉన్నత గుణ సంపన్నుడా శ్రేష్టుడా… ||ధ్యానించుచుంటిమి||
dhyaaninchuchuntimi siluvapai palikina – viluvaina nee maatalu praannaathmalanu seedadeerchu jeeva uutalu (2) mookssamunaku cheerchu baatalu parishuddhathaloo paripuurnnudaa – unnatha gunna sanpannudaa shreesstudaa… ||dhyaaninchuchuntimi||
తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు వీరిని దయతో క్షమించుము అని ప్రార్ధన చేసావా బాధించే వారికి శత్రువులను ప్రేమించుట నేర్పుటకై (2) ||పరిశుద్ధతలో||
thandri veereemi cheeyuchunnaaroo erugaru veerini dayathoo kssaminchumu ani praardhana cheesaavaa baadhinchee vaariki shathruvulanu preeminchuta neerputakai (2) ||parishuddhathaloo||
నేడే నాతోను పరదైసులో నీవుందువు నిశ్చయముగ ప్రవేశింతువు అని మాట ఇచ్చావా దొంగ వైపు చూచి అధికారముతో పాపిని రక్షించి ఇదిగో నీ తల్లి ఇతడే నీ కుమారుడు కష్టము రానీయకు ఎప్పుడు అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను తెలియజేయ కుటుంబ ప్రాధాన్యతను దేవా నా దేవా నను విడనాడితివెందుకు చెవినీయవె నా ప్రార్థనకు అని కేక వేసావా శిక్షననుభవిస్తూ పరలోక మార్గం సిద్ధము చేస్తూ సర్వ సృష్టికర్తను నే దప్పిగొనుచుంటిని వాక్యము నెరవేర్చుచుంటిని అని సత్యము తెలిపావా కన్నులు తెరచుటకు జీవ జలమును అనుగ్రహించుటకు సమాప్తిమయ్యింది లోక విమోచన కార్యం నెరవేరెను ఘన సంకల్పం అని ప్రకటన చేసావా కల్వరి గిరి నుంచి పని ముగించి నీ తండ్రిని ఘనపరచి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచుంటిని నీ యొద్దకు వచ్చుచుంటిని అని విన్నవించావా విధేయత తోటి తల వంచి తృప్తిగ విజయము చాటి
needee naathoonu paradaisuloo neevunduvu nishchayamuga praveeshinthuvu ani maata ichchaavaa donga vaipu chuuchi adhikaaramuthoo paapini rakssinchi idigoo nee thalli ithadee nee kumaarudu kasstamu raaneeyaku eppudu ani shissyunikichchaavaa amma baadhyathanu theliyajeeya kutunba praadhaanyathanu deevaa naa deevaa nanu vidanaadithivenduku chevineeyave naa praarthanaku ani keeka veesaavaa shikssananubhavisthuu paralooka maargam siddhamu cheesthuu sarva srusstikarthanu nee dappigonuchuntini vaakyamu neraveerchuchuntini ani sathyamu thelipaavaa kannulu therachutaku jeeva jalamunu anugrahinchutaku samaapthimayyindi looka vimoochana kaaryam neraveerenu ghana sankalpam ani prakatana cheesaavaa kalvari giri nunchi pani muginchi nee thandrini ghanaparachi naa aathmanu nee cheethiki appaginchuchuntini nee yoddaku vachchuchuntini ani vinnavinchaavaa vidheeyatha thooti thala vanchi thrupthiga vijayamu chaati