దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా దిగి
divineelu sthoothraarhudaa yeesayyaa digi
దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా దిగి రానైయున్న మహరాజువు నీవయ్యా మొదటివాడవు – కడపటివాడవు యుగయుగములలో ఉన్నవాడవు (2) మానక నా యెడల కృప చూపుచున్నావు మారదు నీ ప్రేమ తరతరములకు మాట తప్పని మహనీయుడవు – మార్పులేని వాడవు నీవు చెప్పిన మంచి మాటలు – నెరవేర్చువాడవు నీ మాటలు జీవపు ఊటలు నీ కృపలే బలమైన కోటలు (2) ||దివినేలు||
divineelu sthoothraarhudaa yeesayyaa digi raanaiyunna maharaajuvu neevayyaa modativaadavu – kadapativaadavu yugayugamulaloo unnavaadavu (2) maanaka naa yedala krupa chuupuchunnaavu maaradu nee preema tharatharamulaku maata thappani mahaneeyudavu – maarpuleeni vaadavu neevu cheppina manchi maatalu – neraveerchuvaadavu nee maatalu jeevapu uutalu nee krupalee balamaina kootalu (2) ||divineelu||
దాచక నీ సంకల్పము తెలియజేయుచున్నావు దయనొందిన నీ జనుల ముందు నడుచుచున్నావు దాటి వెళ్లని కరుణామూర్తివై – మనవి ఆలకించావు దీర్ఘ శాంతముగలవాడవై – దీవించువాడవు నీ దీవెన పరిమళ సువాసన నీ ఘనతే స్థిరమైన సంపద సీయోను శిఖరముపై నను నిలుపుటకే జ్యేష్ఠుల సంఘముగా నను మార్చుటకే దివ్యమైన ప్రత్యక్షతతో – నన్ను నింపియున్నావు సుందరమైన నీ పోలికగా – రూపు దిద్దుచున్నావు నీ రాజ్యము పరిశుద్ధ నగరము ఆ రాజ్యమే నిత్య సంతోషము
daachaka nee sankalpamu theliyajeeyuchunnaavu dayanondina nee janula mundu naduchuchunnaavu daati velllani karunnaamuurthivai – manavi aalakinchaavu deergha shaanthamugalavaadavai – deevinchuvaadavu nee deevena parimalla suvaasana nee ghanathee sthiramaina sanpada seeyoonu shikharamupai nanu niluputakee jyeesstthula sanghamugaa nanu maarchutakee divyamaina prathyakssathathoo – nannu ninpiyunnaavu sundaramaina nee poolikagaa – ruupu didduchunnaavu nee raajyamu parishuddha nagaramu aa raajyamee nithya santhoossamu