ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ
edabaayani nee krupa nanu viduvadu ennatikee
ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ (2) యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం (2) ||ఎడబాయని||
edabaayani nee krupa nanu viduvadu ennatikee (2) yeesayyaa nee preemaanuraagan nanu kaayunu anukshanan (2) ||edabaayani||
శోకపు లోయలలో – కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో – నిరాశ నిసృహలో అర్ధమేకాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరముగల దేవా నా కష్టాల కడలిని దాటించితివి ||ఎడబాయని||
shookapu looyalaloo – kashtaala kadagandlaloo kadaleeni kadaliloo – niraasha nisruhaloo ardhameekaani ee jeevitan ika vyarthamani neenanukonagaa krupaa kanikaramugala deevaa naa kashtaala kadalini daatinchitivi ||edabaayani||
విశ్వాస పోరాటములో – ఎదురాయె శోధనలు లోకాశల అలజడిలో – సడలితి విశ్వాసములో దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దీర్ఘశాంతముగల దేవా నా చేయి విడువక నడిపించితివి ||ఎడబాయని||
vishvaasa pooraatamuloo – eduraaye shoodhanalu lookaashala alajadiloo – sadaliti vishvaasamuloo dushtula ksheemamunee choochi ika neeti vyarthamani anukonagaa deerghashaantamugala deevaa naa cheeyi viduvaka nadipinchitivi ||edabaayani||
నీ సేవలో ఎదురైన – ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని – నిరాశ చెందితిని భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరిచితివి ||ఎడబాయని||
nee seevaloo eduraina – ennoo samasyalaloo naa balamunu choochukoni – niraasha chenditini bhaaramaina ee seevanu ika cheeyaleenani anukonagaa pradhaana yaajakudaa yeesu nee anubhavaalatoo balaparichitivi ||edabaayani||