ఏ చెట్టు గుట్ట పుట్ట
ee chettu gutta putta
ఏ చెట్టు గుట్ట పుట్ట మట్టి మోక్ష్యమునీయదయ్యా ఏ రాయి రప్ప దేవుళ్లంతా మార్గము చూపరయ్యా (2) యేసే నిజ దేవుడు – పాపుల రక్షించును (2) ||ఏ చెట్టు||
ee chettu gutta putta matti mookssyamuneeyadayyaa ee raayi rappa deevulllanthaa maargamu chuuparayyaa (2) yeesee nija deevudu – paapula rakssinchunu (2) ||ee chettu||
పాపమంతయూ తొలగింపను – దైవమే దిగి వచ్చెను గొర్రెపిల్లగా తల వంచెను – ప్రాణమునే అర్పించెను నరుల పాపము తన భుజాలపై మోపుకొనెను పరమ దేవుడు నమ్మిన వారై రక్షణ పొంద స్వర్గానికే చేరుకుందమా మహిమ రూపుడే మనిషి జన్మలో – భువికి అవతరించెను సిలువ మ్రానుపై వ్రేళాడెను – రక్తము చిందించెను యేసు లేచెను మరణము గెలిచి నమ్మిన వారిని పరమును చేర్చ హల్లెలూయా ఆనందమే హల్లెలూయా సంతోషమే
paapamanthayuu tholaginpanu – daivamee digi vachchenu gorrepillagaa thala vanchenu – praannamunee arpinchenu narula paapamu thana bhujaalapai moopukonenu parama deevudu nammina vaarai rakssanna ponda svargaanikee cheerukundamaa mahima ruupudee manissi janmaloo – bhuviki avatharinchenu siluva mraanupai vreellaadenu – rakthamu chindinchenu yeesu leechenu marannamu gelichi nammina vaarini paramunu cheercha halleluuyaa aanandamee halleluuyaa santhoossamee