ఈ జీవిత ఈత ఈదలేకున్నాను - నా చేయి పట్టుకో నా యేసు నాధా గాలి తుఫానులకు కలిగే తరంగముల కొట్టబడుచున్నాను గానా ...దేవా
ee jeevitha eetha eedaleekunnaanu - naa cheeyi pattukoo naa yeesu naadhaa gaali thuphaanulaku kaligee tharangamula kottabaduchunnaanu gaanaa ...deevaa
ఈ జీవిత ఈత ఈదలేకున్నాను - నా చేయి పట్టుకో నా యేసు నాధా గాలి తుఫానులకు కలిగే తరంగముల కొట్టబడుచున్నాను గానా ...దేవా
ee jeevitha eetha eedaleekunnaanu - naa cheeyi pattukoo naa yeesu naadhaa gaali thuphaanulaku kaligee tharangamula kottabaduchunnaanu gaanaa ...deevaa
సారహీనపు సంసారాబ్దిలోన సాగలేకున్నాను సాయంబు రావా సార కరుణా రసధారల్ నొసగుము సాగిపోవను ముందుకు శక్తిని నాకిమ్ము ||ఈ జీవిత ||
saaraheenapu sansaaraabdiloona saagaleekunnaanu saayanbu raavaa saara karunnaa rasadhaaral nosagumu saagipoovanu munduku shakthini naakimmu ||ee jeevitha ||
సంఘ సంబంధముగ శాంతి లేకపోయె - సమానతత్వంబు సమసిపోయే - సోదరులే నాకు శత్రువులైరి - సమాధానము నొసగు సరుగున రావా దేవా ||ఈ జీవిత||
sangha sanbandhamuga shaanthi leekapooye - samaanathathvanbu samasipooyee - soodarulee naaku shathruvulairi - samaadhaanamu nosagu saruguna raavaa deevaa ||ee jeevitha||
బయట పోరాటములు భయపెట్టుచుండెను భార్యా పుత్రాదులచే బాధలేన్నో కలిగే బాధలన్నియు బాయ బహు త్వరగా రావా ||ఈ జీవిత ||
bayata pooraatamulu bhayapettuchundenu bhaaryaa puthraadulachee baadhaleennoo kaligee baadhalanniyu baaya bahu thvaragaa raavaa ||ee jeevitha ||
రాజ్యంబు పై రాజ్యంబు రంకె వేయుచుండే - రాష్ట్రము పై రాష్ట్రంబు రగులుచుండె - రాజులకు రాజువై రయముగ రావయ్యా - రాజ్యమేలను త్వరలో రమ్ము రమ్ము ||ఈ జీవిత ||
raajyanbu pai raajyanbu ranke veeyuchundee - raasstramu pai raasstranbu raguluchunde - raajulaku raajuvai rayamuga raavayyaa - raajyameelanu thvaraloo rammu rammu ||ee jeevitha ||
సైతాను చెలరేగే సమయంబిక లేదని సింహంబు రీతి గర్జించుచుండె - సంకెళ్ళతో వచ్చి సైతానుని బంధించి సమాధాన రాజ్యం స్థాపింప రావా ||ఈ జీవిత||
saithaanu chelareegee samayanbika leedani sinhanbu reethi garjinchuchunde - sankellllathoo vachchi saithaanuni bandhinchi samaadhaana raajyam sthaapinpa raavaa ||ee jeevitha||
మొదటి జామయ్యెను మీరింక రారయ్యే - రెండవ జామున జాడలేదే - మూడవ జామయ్యే మీరింక రాలేదే - నాల్గవ జామున నడిచి వస్తున్నావా ||ఈ జీవిత||
modati jaamayyenu meerinka raarayyee - rendava jaamuna jaadaleedee - muudava jaamayyee meerinka raaleedee - naalgava jaamuna nadichi vasthunnaavaa ||ee jeevitha||
పెండ్లి కుమారుడు ప్రభువైన క్రీస్తుండు పెండ్లి సంఘం ఆత్మయు పిలచుచుండెను - పెండ్లి విందులో నేను పెండ్లి వస్త్రముతోను హల్లెలూయ యని పాడెదను ||ఈ జీవిత ||
pendli kumaarudu prabhuvaina kreesthundu pendli sangham aathmayu pilachuchundenu - pendli vinduloo neenu pendli vasthramuthoonu halleluuya yani paadedanu ||ee jeevitha ||