ఈ జీవితం విలువైనది నరులారా
ee jeevitham viluvainadi narulaaraa
ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది (2) సిద్ధపడినావా చివరి యాత్రకు యుగయుగాలు దేవునితో ఉండుటకు నీవుండుటకు ||ఈ జీవితం||
ee jeevitham viluvainadi narulaaraa randani selavainadi (2) siddhapadinaavaa chivari yaathraku yugayugaalu deevunithoo undutaku neevundutaku ||ee jeevitham||
సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు పోతున్నవారిని నువు చుచుటలేదా బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2) ||ఈ జీవితం||
sanpaadana koosamee puttaleedu neevu pooyeetappudu eedee pattukoni poovu poothunnavaarini nuvu chuchutaleedaa brathiki unna neeku vaaru paatthamee kaadaa (2) ||ee jeevitham||
మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు చిన్న పెద్ద తేడా లేదు మరణానికి కులమతాలు అడ్డం కాదు స్మశానానికి పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పుచెందు మరణానికి ముందు యేసు రక్తమే నీ పాపానికి మందు కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు
marannamu ruchi chuudaka brathikee narudevadu kalakaalamee lookanloo undee sthirudevadu chinna pedda theedaa leedu marannaaniki kulamathaalu addam kaadu smashaanaaniki paapulaku chootu leedu paralookamunandu andukee maarpuchendu marannaaniki mundu yeesu rakthamee nee paapaaniki mandu kadagabadina vaarikee gorrepilla vindu