ఈ ఉదయం – శుభ
ee udayam – shubha
ఈ ఉదయం – శుభ ఉదయం ప్రభువే నాకొసగిన – ఆనంద సమయం ఆశ్రయించెదన్ – దివ్య వాక్యమున్ ప్రేమతోడ సరిచేసే – శ్రేష్ఠ సత్యమున్ ||ఈ ఉదయం||
ee udayam – shubha udayam prabhuvee naakosagina – aananda samayam aashrayinchedan – divya vaakyamun preemathooda saricheesee – shreessttha sathyamun ||ee udayam||
బలహీనమైతి నేను – బలపరచుము తండ్రి ఫలహీనమైతి నేను – ఫలియింపజేయుము వాక్య ధ్యానమే – నీ ముఖ దర్శనము పరిశుద్ధ పరచెడి – పరమతండ్రి మార్గము అస్థిరమునైతి నేను – స్థిరపరచుము తండ్రి అల్పవిశ్వాసి నేను – అద్దరికి జేర్చుము నీ పాదసన్నిధే – నాకు శరణము అభయంబునిచ్చెడి – ఆశ్రయపురము
balaheenamaithi neenu – balaparachumu thandri phalaheenamaithi neenu – phaliyinpajeeyumu vaakya dhyaanamee – nee mukha darshanamu parishuddha parachedi – paramathandri maargamu asthiramunaithi neenu – sthiraparachumu thandri alpavishvaasi neenu – addariki jeerchumu nee paadasannidhee – naaku sharannamu abhayanbunichchedi – aashrayapuramu