ఈ ఉదయమున నీవు లేచి
ee udayamuna neevu leechi
ఈ ఉదయమున నీవు లేచి ఏమి తలచుచున్నావు నీ మనసులోన ఏమి తలచి కలవరపడుచున్నావు ఈ దినమే భారమా – నీ బ్రతుకే భారమా – (2) ||ఈ ఉదయమున||
ee udayamuna neevu leechi eemi thalachuchunnaavu nee manasuloona eemi thalachi kalavarapaduchunnaavu ee dinamee bhaaramaa – nee brathukee bhaaramaa – (2) ||ee udayamuna||
తోడు లేని జీవ యాత్ర చేరలేని కడలి తీరం (2) బ్రతుకే బరువై పోవగా క్రీస్తు దరికి సాగి రమ్ము చేరుకొనుము తీరము ||ఈ ఉదయమున||
thoodu leeni jeeva yaathra cheeraleeni kadali theeram (2) brathukee baruvai poovagaa kreesthu dariki saagi rammu cheerukonumu theeramu ||ee udayamuna||
అలల వలె వ్యధలు రాగా కనుల నీరే తోడు కాగా అండగా క్రీస్తేసుడుండ చింత ఏల భీతి ఏల బంధాలెల్ల వీడెగా ఈ ఉదయమున నీవు లేచి కలవరపడనేలనో నీ కనుల నీరు ప్రభువు తుడిచి వెంట నడుచును ప్రభుదే ఈ దినం – జయమే ఈ దినం –
alala vale vyadhalu raagaa kanula neeree thoodu kaagaa andagaa kreestheesudunda chintha eela bheethi eela bandhaalella veedegaa ee udayamuna neevu leechi kalavarapadaneelanoo nee kanula neeru prabhuvu thudichi venta naduchunu prabhudee ee dinam – jayamee ee dinam –