ఎక్కడో మనసు వెళ్ళిపోయింది ఏమిటో
ekkadoo manasu vellllipooyindi eemitoo
ఎక్కడో మనసు వెళ్ళిపోయింది ఏమిటో ఇటు రానే రానంది ఆహాహా.. ఓహోహో… నిజ ప్రేమ చెంతకు తను చేరానంటుంది ఈ భువిలోన ఎక్కడైనను కానరాదంది (2) అక్కడే చిక్కుకుపోయానంటుంది బయటకు రానే రాలేనంటూ మారాము చేస్తుంది (2) ||ఎక్కడో||
ekkadoo manasu vellllipooyindi eemitoo itu raanee raanandi aahaahaa.. oohoohoo… nija preema chenthaku thanu cheeraanantundi ee bhuviloona ekkadainanu kaanaraadandi (2) akkadee chikkukupooyaanantundi bayataku raanee raaleenantuu maaraamu cheesthundi (2) ||ekkadoo||
జీవితాంతము పాద చెంతనే ఉంటానంటుంది తన ప్రియుని వదలి క్షణమైనా రాలేనన్నది దేనికీ ఇక చోటే లేదంది యేసు రాజుని గుండె నిండ నింపుకున్నానంటుంది ఏకాంతముగా యేసయ్యతో ఉన్నానంటుంది ఎవరైనా సరే మధ్యలో అసలెందుకు అంటుంది అక్కడే కరిగిపోతానంటుంది ప్రేమ ప్రవాహములో మునిగి పోయానంటుంది
jeevithaanthamu paada chenthanee untaanantundi thana priyuni vadali kssannamainaa raaleenannadi deenikee ika chootee leedandi yeesu raajuni gunde ninda ninpukunnaanantundi eekaanthamugaa yeesayyathoo unnaanantundi evarainaa saree madhyaloo asalenduku antundi akkadee karigipoothaanantundi preema pravaahamuloo munigi pooyaanantundi