ఎవరో తెలుసా యేసయ్యా - చెబుతా నేడు వినవయ్యా
evaroo thelusaa yeesayyaa - chebuthaa needu vinavayyaa
ఎవరో తెలుసా యేసయ్యా - చెబుతా నేడు వినవయ్యా పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి - రక్షణ పొందవయ్యా
evaroo thelusaa yeesayyaa - chebuthaa needu vinavayyaa pedachevi pettaka thvarapadi vachchi - rakssanna pondavayyaa
దేవాది దేవుడు యేసయ్యా - మానవ జన్మతో వచ్చాడయ్యా మరణించాడు మరి లేచాడు - నీనా పాప విమోచనకై ||ఎవరో||
deevaadi deevudu yeesayyaa - maanava janmathoo vachchaadayyaa maranninchaadu mari leechaadu - neenaa paapa vimoochanakai ||evaroo||
ధనవంతుడై యుండి యేసయ్యా - దరిద్రుడై ఇల పుట్టాడయ్యా రూపు రేఖలు కోల్పోయాడు - నీనా పాపవిమోచనకై ||ఎవరో||
dhanavanthudai yundi yeesayyaa - daridrudai ila puttaadayyaa ruupu reekhalu koolpooyaadu - neenaa paapavimoochanakai ||evaroo||
పాపుల రక్షకుడేసయ్యా - కార్చెను రక్తము పాపులకై తన ధరి చేరిన పాపుల నెల్ల - కడుగును తనదు రక్తముతో ||ఎవరో||
paapula rakssakudeesayyaa - kaarchenu rakthamu paapulakai thana dhari cheerina paapula nella - kadugunu thanadu rakthamuthoo ||evaroo||
యేసే దేవుడు ఎరుగవయ్యా - రాజులరాజుగా వస్తాడయ్యా నమ్మినవారిని చేర్చును పరమున - నమ్మని వారికి నరకమేగా ||ఎవరో||
yeesee deevudu erugavayyaa - raajularaajugaa vasthaadayyaa namminavaarini cheerchunu paramuna - nammani vaariki narakameegaa ||evaroo||
యేసుని తరుపున ప్రతినిధినై - దేవుని ప్రేమకు ప్రతిరూపమై అతి వినయముగా బతిమాలుచున్నాను - నేడే నమ్ముము ప్రభు యేసుని ||ఎవరో||
yeesuni tharupuna prathinidhinai - deevuni preemaku prathiruupamai athi vinayamugaa bathimaaluchunnaanu - needee nammumu prabhu yeesuni ||evaroo||