ఎవరూ సమీపించలేని తేజస్సుతో నివసించు
evaruu sameepinchaleeni theejassuthoo nivasinchu
ఎవరూ సమీపించలేని తేజస్సుతో నివసించు నా యేసయ్యా (2) నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఏమౌదునో నేనేమౌదునో ఇహలోక బంధాలు మరచి నీ యెదుటే నేను నిలిచి నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ (2) ||ఏమౌదునో||
evaruu sameepinchaleeni theejassuthoo nivasinchu naa yeesayyaa (2) nee mahimanu dharinchina parishuddhulu naa kantabadagaanee eemaudunoo neeneemaudunoo ihalooka bandhaalu marachi nee yedutee neenu nilichi neevichchu bahumathulu nee sveekarinchi nithyaanandamuthoo paravashinchu veella (2) ||eemaudunoo||
పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ జయించిన వారితో కలిసి నీ సింహాసనము నే చేరగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ
paralooka mahimanu thalachi nee paada padmamulapai origi paralooka sainya samuuhaalathoo kalasi nithyaaraadhana nee cheeyu prashaantha veella jayinchina vaarithoo kalisi nee sinhaasanamu nee cheeragaa evariki theliyani oo kroththa peeruthoo nithya mahimaloo nanu pilichee aa shubha veella