గాయాములన్ గాయములన్ నా కొరకై
gaayaamulan gaayamulan naa korakai
గాయాములన్ గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు (2) సురూపమైన సొగసైనా లేదు దుఃఖ భరితుడాయెను వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమొందెన్ వీక్షించి త్రిప్పిరి ముఖముల్ (2) ||గాయాములన్||
gaayaamulan gaayamulan naa korakai pondenu kreesthu prabhu (2) suruupamaina sogasainaa leedu duhkha bharithudaayenu vyaadhigrasthudugaa vyaakulamonden veekssinchi thrippiri mukhamul (2) ||gaayaamulan||
మా అతిక్రమ క్రియలను బట్టి మరి నలుగ గొట్టబడెను తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగె మనకు క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనల సిలువపై మేము గమనించ మాకు విలువైన విడుదల కలిగె
maa athikrama kriyalanu batti mari naluga gottabadenu thaanu pondina debbala dvaaraa svasthatha kalige manaku kreesthu preemanu maruvajaalamu enthoo preeminchee manala siluvapai meemu gamanincha maaku viluvaina vidudala kalige