గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని
gaganamu cheelchukoni ghanulanu theesukoni
గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని నన్ను కొనిపోవ రానైయున్న ప్రాణప్రియుడా యేసయ్యా (2) నిన్ను చూడాలని… నా హృదయమెంతో ఉల్లసించుచున్నది ఉల్లసించుచున్నది… ||గగనము||
gaganamu cheelchukoni ghanulanu theesukoni nannu konipoova raanaiyunna praannapriyudaa yeesayyaa (2) ninnu chuudaalani… naa hrudayamenthoo ullasinchuchunnadi ullasinchuchunnadi… ||gaganamu||
నీ దయా సంకల్పమే – నీ ప్రేమను పంచినది నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది పవిత్రురాలైన కన్యకగా – నీ యెదుట నేను నిలిచెదను నీ కౌగిలిలో నేను విశ్రమింతును (2) ||గగనము||
nee dayaa sankalpamee – nee preemanu panchinadi nee chiththamee naaloo neraveeruchunnadi pavithruraalaina kanyakagaa – nee yeduta neenu nilichedanu nee kaugililoo neenu vishraminthunu (2) ||gaganamu||
నీ మహిమైశ్వర్యమే – జ్ఞాన సంపదనిచ్చినది మర్మమైయున్న నీవలె రూపించుచున్నది కళంకములేని వధువునై – నిరీక్షణతో నిన్ను చేరెదను యుగయుగాలు నీతో ఏలెదను నీ కృపా బాహుళ్యమే – ఐశ్వర్యమునిచ్చినది తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది అక్షయమైన దేహముతో – అనాది ప్రణాళికతో సీయోనులో నీతో నేనుందును
nee mahimaishvaryamee – jnyaana sanpadanichchinadi marmamaiyunna neevale ruupinchuchunnadi kallankamuleeni vadhuvunai – nireekssannathoo ninnu cheeredanu yugayugaalu neethoo eeledanu nee krupaa baahullyamee – aishvaryamunichchinadi theejoovaasula svaasthyam anugrahinchinadi akssayamaina deehamuthoo – anaadi prannaallikathoo seeyoonuloo neethoo neenundunu