గత కాలమంత నిను కాచిన
gatha kaalamantha ninu kaachina
గత కాలమంత నిను కాచిన దేవుడు ఈ రోజు నిన్ను ఎంతో దీవించెను ఇయ్యి నీ మనసియ్యి – చెయ్యి స్తోత్రము చెయ్యి ఇయ్యి కానుకలియ్యి – చెయ్యి ప్రార్థన చెయ్యి మట్టి కుండగా పుట్టించి నిన్ను కంటి పాపగా కాపాడినాడు (2) అందాలాలెన్నో ఎక్కించువాడు అందరిలో నిన్ను మెప్పించుతాడు (2) ||ఇయ్యి||
gatha kaalamantha ninu kaachina deevudu ee rooju ninnu enthoo deevinchenu iyyi nee manasiyyi – cheyyi sthoothramu cheyyi iyyi kaanukaliyyi – cheyyi praarthana cheyyi matti kundagaa puttinchi ninnu kanti paapagaa kaapaadinaadu (2) andaalaalennoo ekkinchuvaadu andariloo ninnu meppinchuthaadu (2) ||iyyi||
యేసుని హత్తుకో ఈ లోకమందు ఓపిక తెచ్చుకో యేసు రాక ముందు తలను ఎత్తుకొని పైకెత్తి చూడు మరలా యేసు రాజు దిగి వస్తున్నాడు (2) ||ఇయ్యి||
yeesuni haththukoo ee lookamandu oopika thechchukoo yeesu raaka mundu thalanu eththukoni paikeththi chuudu maralaa yeesu raaju digi vasthunnaadu (2) ||iyyi||
కష్టాలలో నిన్ను కాపాడినాడు నష్టాలలో నిన్ను కాపాడినాడు నీవు నమ్ముకుంటే నిను వదులలేడు నిన్ను ఎప్పుడూ ఎడబాసి పోడు (2) ||ఇయ్యి||
kasstaalaloo ninnu kaapaadinaadu nasstaalaloo ninnu kaapaadinaadu neevu nammukuntee ninu vadulaleedu ninnu eppuduu edabaasi poodu (2) ||iyyi||