హల్లెలూయ పాటలతో ఆనంద గీతాలతో
halleluuya paatalathoo aananda geethaalathoo
హల్లెలూయ పాటలతో ఆనంద గీతాలతో (2) కృపామయుండా నీ మేలులన్ని స్మరించి స్తుతింతును నేనారణ్యా యానములో నిను పలుమార్లు విసిగించినా కోపించుచునే వాత్సల్యము చూపి అనుదినము నను మరువక మన్నాను నాకిడితివి (2) ||హల్లెలూయ||
halleluuya paatalathoo aananda geethaalathoo (2) krupaamayundaa nee meelulanni smarinchi sthuthinthunu neenaarannyaa yaanamuloo ninu palumaarlu visiginchinaa koopinchuchunee vaathsalyamu chuupi anudinamu nanu maruvaka mannaanu naakidithivi (2) ||halleluuya||
మలినంబైన వలువలతో నే నీ ఎదుట నిలుచుండగా కృపతో నా నేరములను క్షమియించి పరిశుద్ధ వస్త్రములతో నన్నలంకరించితివి నే కృంగిన వేళలలో నీ అభిషేక తైలముచే పక్షిరాజు యవ్వనము వలె నా బలము నూతనము జేసితివి నను పైకెగుర జేసితివి
malinanbaina valuvalathoo nee nee eduta niluchundagaa krupathoo naa neeramulanu kssamiyinchi parishuddha vasthramulathoo nannalankarinchithivi nee krungina veellalaloo nee abhisseeka thailamuchee pakssiraaju yavvanamu vale naa balamu nuuthanamu jeesithivi nanu paikegura jeesithivi