హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు
halleluuyaa yeesu prabhun ellaru
హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్ హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతియించుడి పాపమును రక్తముతో తుడిచెను స్తుతియించుడి బూరతోను తాళముతో మ్రోగించి స్తుతియించుడి నిరంతరము మారని యేసుని స్తుతియించుడి ||రాజుల||
halleluuyaa yeesu prabhun ellaru sthuthiyinchudi vallabhuni charyalanu thilakinchi sthuthiyinchudi balamaina pani cheeyu balavanthuni sthuthiyinchudi ellarini sveekarinchu yeesuni sthuthiyinchudi raajula raajaina yeesu raaju bhuujanulaneelun halleluuyaa, halleluuyaa deevuni sthuthiyinchudi thanburathoonu veennathoonu prabhuvuni sthuthiyinchudi paapamunu rakthamuthoo thudichenu sthuthiyinchudi buurathoonu thaallamuthoo mrooginchi sthuthiyinchudi nirantharamu maarani yeesuni sthuthiyinchudi ||raajula||
సూర్య చంద్రులారా ఇల దేవుని స్తుతియించుడి హృదయమును వెలిగించిన యేసుని స్తుతియించుడి అగ్నివడగండ్లార మీరు కర్తను స్తుతియించుడి హృదయమును చేధించిన నాథుని స్తుతియించుడి యువకులారా పిల్లలారా దేవుని స్తుతియించుడి జీవితమున్ ప్రభుపనికై సమర్పించి స్తుతియించుడి పెద్దలారా ప్రభువులారా యెహోవాను స్తుతియించుడి ఆస్తులను యేసునకై అర్పించి స్తుతియించుడి అగాథమైన జలములారా దేవుని స్తుతియించుడి అలలవలె సేవకులు లేచిరి స్తుతియించుడి దూతలారా పూర్వ భక్తులారా దేవుని స్తుతియించుడి పరమందు పరిశుద్ధులు ఎల్లరు స్తుతియించుడి
suurya chandrulaaraa ila deevuni sthuthiyinchudi hrudayamunu veliginchina yeesuni sthuthiyinchudi agnivadagandlaara meeru karthanu sthuthiyinchudi hrudayamunu cheedhinchina naathuni sthuthiyinchudi yuvakulaaraa pillalaaraa deevuni sthuthiyinchudi jeevithamun prabhupanikai samarpinchi sthuthiyinchudi peddalaaraa prabhuvulaaraa yehoovaanu sthuthiyinchudi aasthulanu yeesunakai arpinchi sthuthiyinchudi agaathamaina jalamulaaraa deevuni sthuthiyinchudi alalavale seevakulu leechiri sthuthiyinchudi duuthalaaraa puurva bhakthulaaraa deevuni sthuthiyinchudi paramandu parishuddhulu ellaru sthuthiyinchudi