ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణము
iddarokkatiga maareeti madhuramaina kssannamu
ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము (2) వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి – ఫలించమని దీవించెను సృష్టిపైన అధికారముతో – పాలించుమని నియమించెను (2) ||వివాహమన్నది||
iddarokkatiga maareeti madhuramaina kssannamu deevuni chiththamuloo penaveesina nithya anubandhamu (2) vivaahamannadi anninta ghanamainadi aadaamu havvalathoo modalaindi aa sandadi ontaraina aadaamunu chuusi janta kaavaalani madi thalachi havvanu cheesi jathaparachi – phalinchamani deevinchenu srusstipaina adhikaaramuthoo – paalinchumani niyaminchenu (2) ||vivaahamannadi||
ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని – దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం – దేవుని కొరకై ప్రతి క్షణం భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి – సాక్ష్యములను చాటించాలి సంతానమును పొందుకొని – తండ్రి రాజ్యముకు చేర్చాలి
eeka manasuthoo munduku saagi jeeva vrukssamuku maargamu erigi sontha thelivini maanukoni – daiva vaakkupai aanukoni saagipoovaali aa payanam – deevuni korakai prathi kssannam bhaarya bharthalu samaanamantuu okari koosamu okaranukuntuu kreesthu preemanu panchaali – saakssyamulanu chaatinchaali santhaanamunu pondukoni – thandri raajyamuku cheerchaali