ఇదిగో నేనొక నూతన క్రియను
idigoo neenoka nuuthana kriyanu
ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను ఈనాడే అది మొలచును దాని నాలోచింపరా (2) ||ఇదిగో||
idigoo neenoka nuuthana kriyanu cheeyuchunnaanu eenaadee adi molachunu daani naaloochinparaa (2) ||idigoo||
అడవిలో త్రోవనుజేసి – ఎడారిలో నదులను నేను ఎల్లప్పుడు సమృద్ధిగా – ప్రవహింప జేసెదను నాదు ప్రజలు త్రాగుటకు – నేనరణ్యములో నదులు సమృద్ధిగా పారునట్లు – సృష్టించెదను నేను అరణ్యములో జంతువులు – క్రూరపక్షులు సర్పములు ఘనపరచును స్తుతియించును – దీని నాలోచించుడి నూతన సృష్టిగ నినుజేసి – నీ శాంతిని నదివలెజేసి ననుజూచి మహిమపరచి – స్తుతిబాడ జేసెదను నేనే దేవుడనని దెలసి – నా కార్యములను నెరవేర్చి ముందున్న వాటికన్న – ఘనకార్యములను జేతున్ మరుగైన మన్నానిచ్చి – మరితెల్లని రాతినిచ్చి చెక్కెదనా రాతిమీద – నొక క్రొత్త నామమును పరలోక భాగ్యంబులు – నరలోకములో మనకొసగెన్ కరుణాసంపన్నుడగు – మన ప్రభువునకు హల్లెలూయ
adaviloo throovanujeesi – edaariloo nadulanu neenu ellappudu samruddhigaa – pravahinpa jeesedanu naadu prajalu thraagutaku – neenarannyamuloo nadulu samruddhigaa paarunatlu – srusstinchedanu neenu arannyamuloo janthuvulu – kruurapakssulu sarpamulu ghanaparachunu sthuthiyinchunu – deeni naaloochinchudi nuuthana srusstiga ninujeesi – nee shaanthini nadivalejeesi nanujuuchi mahimaparachi – sthuthibaada jeesedanu neenee deevudanani delasi – naa kaaryamulanu neraveerchi mundunna vaatikanna – ghanakaaryamulanu jeethun marugaina mannaanichchi – marithellani raathinichchi chekkedanaa raathimeeda – noka kroththa naamamunu paralooka bhaagyanbulu – naralookamuloo manakosagen karunnaasanpannudagu – mana prabhuvunaku halleluuya