జగములనేలే శ్రీ యేసా మా
jagamulaneelee shree yeesaa maa
జగములనేలే శ్రీ యేసా మా రక్షణ ప్రాకారమా మా అనుదిన జీవాహారమా (2) ||జగములనేలే||
jagamulaneelee shree yeesaa maa rakssanna praakaaramaa maa anudina jeevaahaaramaa (2) ||jagamulaneelee||
వేల్పులలోన నీవంటి దేవుడు ఎవరున్నారు ప్రభు (2) పూజ్యులలోన పూజార్హుడవు నీవే మా ప్రభువా నీవే మా ప్రభువా అడిగిన ఇచ్ఛే దాతవు నీవే దేవా శరణము వేడిన అభయము నొసగే దేవా అవధులు లేని నీ ప్రేమను వర్ణింప చాలనయ్యా వర్ణింప చాలనయ్యా ||జగములనేలే||
veelpulaloona neevanti deevudu evarunnaaru prabhu (2) puujyulaloona puujaarhudavu neevee maa prabhuvaa neevee maa prabhuvaa adigina ichchhee daathavu neevee deevaa sharannamu veedina abhayamu nosagee deevaa avadhulu leeni nee preemanu varnninpa chaalanayyaa varnninpa chaalanayyaa ||jagamulaneelee||
జీవనమంతయు నీకర్పించి పానార్పణముగా నే పోయబడుదును శ్రేష్టఫలములను ఫలియించెదను నీదు సన్నిధిలో నీదు సన్నిధిలో విరిగిన మనస్సే నీకతి ప్రియమో దేవా నలిగిన హృదయం నీ ఆలయంలో దేవా అన్ని వేళలలో మాతో ఉండి మమ్ము నడిపించు ప్రభో మమ్ము నడిపించు ప్రభో
jeevanamanthayu neekarpinchi paanaarpannamugaa nee pooyabadudunu shreesstaphalamulanu phaliyinchedanu needu sannidhiloo needu sannidhiloo virigina manassee neekathi priyamoo deevaa naligina hrudayam nee aalayanloo deevaa anni veellalaloo maathoo undi mammu nadipinchu prabhoo mammu nadipinchu prabhoo