జన్మించె జనంబులకు ఇమ్మానుయేలు జన్మించె
janminche jananbulaku immaanuyeelu janminche
జన్మించె జనంబులకు ఇమ్మానుయేలు జన్మించె జనంబులను రక్షింపను జననమొందె బేత్లెహేము పురమున జనంబులారా సంతసించుడి – సంతసించుడి ||జన్మించె||
janminche jananbulaku immaanuyeelu janminche jananbulanu rakssinpanu jananamonde beethleheemu puramuna jananbulaaraa santhasinchudi – santhasinchudi ||janminche||
లేఖనములు తెల్పినట్లు దీనుడై లోకేశుడు జన్మించెను ప్రసన్నుడై లాకమందు దూతలు బాక నాదంబుతో ఏక స్వరము తోడ పాడిరి (2) ||జన్మించె||
leekhanamulu thelpinatlu deenudai lookeeshudu janminchenu prasannudai laakamandu duuthalu baaka naadanbuthoo eeka svaramu thooda paadiri (2) ||janminche||
నీతి సూర్యుడుదయించె నుర్విలో పాతకంబులెల్ల వీడెను కాంతికి నీతి న్యాయ తీర్పును నూతన శక్తియు సంతసమప్పె దీన ప్రజలకు
neethi suuryududayinche nurviloo paathakanbulella veedenu kaanthiki neethi nyaaya theerpunu nuuthana shakthiyu santhasamappe deena prajalaku