జన్మించె.. జన్మించె.. యేసయ్యా పశువుల
janminche.. janminche.. yeesayyaa pashuvula
జన్మించె.. జన్మించె.. యేసయ్యా పశువుల పాకలోనా.. ఓ.. ఓ .. హల్లెలూయ.. హల్లెలూయ.. హల్లెలూయ.. క్రిస్మస్ ఓ.. ఓ.. రాత్రివేళ గొల్లలు గొర్రెలు కాయుచుండగా దేవదూత వచ్చి శుభవార్తను తెల్పెను (2) సంతోషించి ఆనందించి యేసును చూచి పరవశించి లోకమంతా శుభవార్తను ప్రకటించిరి ఆకాశములో ఒక తార జ్ఞానుల కొరకు వెలసెను యేసు పుట్టిన స్థలమునకు నడిపించెను బంగారు సాంబ్రాణి బోళం బాల యేసునికి అర్పించి మనసార పూజించి కొనియాడిరి సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు తన కిష్టులకు సమాధానము కల్గును గాక పశువుల పాకలో జన్మించిన యేసయ్యా మన హృదయంలో జన్మించుటే క్రిస్మస్ పండుగా
janminche.. janminche.. yeesayyaa pashuvula paakaloonaa.. oo.. oo .. halleluuya.. halleluuya.. halleluuya.. krismas oo.. oo.. raathriveella gollalu gorrelu kaayuchundagaa deevaduutha vachchi shubhavaarthanu thelpenu (2) santhoossinchi aanandinchi yeesunu chuuchi paravashinchi lookamanthaa shubhavaarthanu prakatinchiri aakaashamuloo oka thaara jnyaanula koraku velasenu yeesu puttina sthalamunaku nadipinchenu bangaaru saanbraanni boollam baala yeesuniki arpinchi manasaara puujinchi koniyaadiri sarvoonnatha sthalamulaloo deevuniki mahimayu thana kisstulaku samaadhaanamu kalgunu gaaka pashuvula paakaloo janminchina yeesayyaa mana hrudayanloo janminchutee krismas pandugaa