జీవాధిపతివి నీవే నా యేసయ్య
jeevaadhipathivi neevee naa yeesayya
జీవాధిపతివి నీవే నా యేసయ్య నాకున్న ఆధారము నీవేనయ్యా (2) నీవుంటే చాలు, కీడు కాదా! మేలు లెక్కింపగ తరమా! నే పొందిన ఈవులు (2) ||జీవాధిపతివి||
jeevaadhipathivi neevee naa yeesayya naakunna aadhaaramu neeveenayyaa (2) neevuntee chaalu, keedu kaadaa! meelu lekkinpaga tharamaa! nee pondina eevulu (2) ||jeevaadhipathivi||
ఎడారిలోన నీటి ఊట లిచ్చు వాడవు అల సంద్రములో రహదారులు వేయు వెల్పువు నీకు కానిదేది సాధ్యము? అడుగుటే ఆలస్యము నీవు చేయు కార్యము! ఉహించుటె అసాధ్యము (2) ||నీవుంటే||
edaariloona neeti uuta lichchu vaadavu ala sandramuloo rahadaarulu veeyu velpuvu neeku kaanideedi saadhyamu? adugutee aalasyamu neevu cheeyu kaaryamu! uhinchute asaadhyamu (2) ||neevuntee||
రాజుల హృదయాలను తిప్పువాడవు నిను నమ్ము వారి పక్షము పోరాడు వాడవు ఏ చీకటికి భయపడను, లోకమునకు లొంగను నీవు తోడు ఉండగా, నా వెంట సాగుతుండగా (2) ||నీవుంటే||
raajula hrudayaalanu thippuvaadavu ninu nammu vaari pakssamu pooraadu vaadavu ee cheekatiki bhayapadanu, lookamunaku longanu neevu thoodu undagaa, naa venta saaguthundagaa (2) ||neevuntee||