జీవము గల దేవుని సంఘం
jeevamu gala deevuni sangham
జీవము గల దేవుని సంఘం – ఎంతో ఎంతో రమ్యము మనకై దేవుని సంకల్పం – ఎంతో ఎంతో శ్రేష్ఠము సంకల్పమందున మనముండినా ఆ సంఘమందున వసియించినా ఎంతో ఎంతో ధన్యము – (2) ||జీవము||
jeevamu gala deevuni sangham – enthoo enthoo ramyamu manakai deevuni sankalpam – enthoo enthoo shreesstthamu sankalpamanduna manamundinaa aa sanghamanduna vasiyinchinaa enthoo enthoo dhanyamu – (2) ||jeevamu||
యేసే స్వరక్తమిచ్చి – సంపాదించిన సంఘము సత్యమునకు స్థంభమును – ఆధారమునైయున్నది (2) పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువవు యేసే శిరస్సైయున్న – శరీరము మనమందరము పరిశుద్ధాత్మ మనలో – నివసించుచున్నాడు ఏ నరుడు దేవుని నిలయమును పాడు చేయకూడదు యవ్వన ప్రాయము మనలో – భవ్యానికి భయపడక సవ్వడి చేయుచు నిరతం – కవ్వించు చుండును ప్రభు యేసు దివ్య మాదిరిలో గమ్యము చేరగా సాగుదాం ఏ ప్రాంతీయుల మైన – మనమందరము సోదరులం శాశ్వత రాజ్యపు గురిలో – శ్రీ యేసుని సహ వారసులం లోకాన యేసుని త్యాగమును – సాహసముతో చాటుదాం లోకాన క్రీస్తుని మహిమను – సహనముతోనే చాటుదాం ||జీవము||
yeesee svarakthamichchi – sanpaadinchina sanghamu sathyamunaku sthanbhamunu – aadhaaramunaiyunnadi (2) paathaallalooka dvaaramulu daani eduta niluvavu yeesee shirassaiyunna – shareeramu manamandaramu parishuddhaathma manaloo – nivasinchuchunnaadu ee narudu deevuni nilayamunu paadu cheeyakuudadu yavvana praayamu manaloo – bhavyaaniki bhayapadaka savvadi cheeyuchu niratham – kavvinchu chundunu prabhu yeesu divya maadiriloo gamyamu cheeragaa saagudaam ee praantheeyula maina – manamandaramu soodarulam shaashvatha raajyapu guriloo – shree yeesuni saha vaarasulam lookaana yeesuni thyaagamunu – saahasamuthoo chaatudaam lookaana kreesthuni mahimanu – sahanamuthoonee chaatudaam ||jeevamu||