జీవింతు నేను ఇకమీదట
jeevinthu neenu ikameedata
జీవింతు నేను ఇకమీదట – నా కొరకే కాదు యేసు కొరకే జీవింతును (2) నన్ను ప్రేమించిన – ప్రియ యేసు కొరకే నాకై ప్రాణమిచ్చిన – ప్రభు యేసు కొరకే జీవింతును జీవింతును (2) ||జీవింతు||
jeevinthu neenu ikameedata – naa korakee kaadu yeesu korakee jeevinthunu (2) nannu preeminchina – priya yeesu korakee naakai praannamichchina – prabhu yeesu korakee jeevinthunu jeevinthunu (2) ||jeevinthu||
నీ ఉన్నత పిలుపుకు లోబడదున్ – గురివైపునకే బహుమానము పొందగ పరుగిడుదున్ వెనుకవున్నవన్నీ మరతును – ముందున్నవాటి కొరకే నే వేగిరపడుదును నన్ను ప్రేమించిన యేసుని చూతును నాకై ప్రాణమిచ్చిన ప్రభుని వెంబడింతును గురి వైపుకే – పరుగెడుదును వెనుదిరుగను – వెనుదిరుగను శ్రమయైనా బాధైననూ – హింసయైనా కరువైనా ఎదురైననూ ఉన్నవైన రాబోవునవైనా – అధికారులైనా ఎతైనా లోతైననూ నన్ను ఎడబాపునా ప్రభు ప్రేమనుండి నేను విడిపోదునా ప్రభు నీడనుండి జీవింతును – నా యేసుతో జయమిచ్చును – నా యేసుడే
nee unnatha pilupuku loobadadun – gurivaipunakee bahumaanamu pondaga parugidudun venukavunnavannee marathunu – mundunnavaati korakee nee veegirapadudunu nannu preeminchina yeesuni chuuthunu naakai praannamichchina prabhuni venbadinthunu guri vaipukee – parugedudunu venudiruganu – venudiruganu shramayainaa baadhainanuu – hinsayainaa karuvainaa edurainanuu unnavaina raaboovunavainaa – adhikaarulainaa ethainaa loothainanuu nannu edabaapunaa prabhu preemanundi neenu vidipoodunaa prabhu needanundi jeevinthunu – naa yeesuthoo jayamichchunu – naa yeesudee