కదలకుందువు సీయోను కొండవలె బెదరకుందువు
kadalakunduvu seeyoonu kondavale bedarakunduvu
కదలకుందువు సీయోను కొండవలె బెదరకుందువు బలమైన సింహం వలె (2) యేసయ్య నీ చెంత ఉండగా ఏ చింత నీకింక లేదుగా కష్టములెన్నో కలుగుచున్ననూ నిట్టూర్పులెన్నో వచ్చియున్ననూ దుష్ట జనములుపై దుమికి తరిమిన భ్రష్ట మనుష్యులు నీ మీదికి వచ్చినా ||కదలకుందువు||
kadalakunduvu seeyoonu kondavale bedarakunduvu balamaina sinham vale (2) yeesayya nee chentha undagaa ee chintha neekinka leedugaa kasstamulennoo kaluguchunnanuu nittuurpulennoo vachchiyunnanuu dussta janamulupai dumiki tharimina bhrassta manussyulu nee meediki vachchinaa ||kadalakunduvu||
నీటి వరదలు నిలువెత్తున వచ్చినా నిండు సముద్రము నీళ్లు ఉప్పొంగి పొరలినా ఆకాశము నుండి పై అగ్ని కురసినన్ ఏనాడు ఏ కష్టం నష్టం నీకుండదు నీరు కట్టిన తోటవలెను నిత్యం ఉబుకుచుండు నీటి ఊటవలెను నీటి కాల్వల యోరను నాటబడినదై వర్ధిల్లు వృక్షం వలె నిక్షేపముగా నీవుందువ్
neeti varadalu niluveththuna vachchinaa nindu samudramu neelllu uppongi poralinaa aakaashamu nundi pai agni kurasinan eenaadu ee kasstam nasstam neekundadu neeru kattina thootavalenu nithyam ubukuchundu neeti uutavalenu neeti kaalvala yooranu naatabadinadai vardhillu vrukssam vale niksseepamugaa neevunduv