కడవరి దినములలో రావాలి ఉజ్జీవం
kadavari dinamulaloo raavaali ujjeevam
కడవరి దినములలో రావాలి ఉజ్జీవం యేసుని అడుగులలో నడవాలి యువతరం భావి భారత పౌరులారా - కదలిరండి ఉత్తేజంతో క్రీస్తు రాజ్యవారసులారా - తరలిరండి ఉద్వేగంతో
kadavari dinamulaloo raavaali ujjeevam yeesuni adugulaloo nadavaali yuvatharam bhaavi bhaaratha paurulaaraa - kadalirandi uththeejanthoo kreesthu raajyavaarasulaaraa - tharalirandi udveeganthoo
క్రీస్తు సిలువను భుజమును మోస్తు - ఆసేతు హిమాలయం యేసు పవిత్ర నామం ఇలలో మారు మ్రోగునట్లు విగ్రహారాధనను భువిపై రూపు మాపే వరకు భారత దేశం క్రీస్తు రాకకై సిద్దమయ్యే వరకు కదలి రావాలి యువజనము - కలసి తేవాలి చైతన్యం (2) భావి భారత పౌరులారా - కదలిరండి ఉత్తేజంతో క్రీస్తు రాజ్యవారసులారా - తరలిరండి ఉద్వేగంతో ||కడవరి దినములలో||
kreesthu siluvanu bhujamunu moosthu - aaseethu himaalayam yeesu pavithra naamam ilaloo maaru mroogunatlu vigrahaaraadhananu bhuvipai ruupu maapee varaku bhaaratha deesham kreesthu raakakai siddamayyee varaku kadali raavaali yuvajanamu - kalasi theevaali chaithanyam (2) bhaavi bhaaratha paurulaaraa - kadalirandi uththeejanthoo kreesthu raajyavaarasulaaraa - tharalirandi udveeganthoo ||kadavari dinamulaloo||
కులము, మతము మనిషికి రక్షణ ఇవ్వవని నినదించండి యేసుక్రీస్తు ప్రభువే ఇలలో లోక రక్షకుడనుచు మూఢ నమ్మకాలు భువిపై సమసిపోయే వరకు అనాగరికులు, మతోన్మాదులు - మార్పు చెందేవరకు కదలి రావాలి యువజనము - కలసి తేవాలి చైతన్యం (2) భావి భారత పౌరులారా - కదలిరండి ఉత్తేజంతో క్రీస్తు రాజ్యవారసులారా - తరలిరండి ఉద్వేగంతో ||కడవరి దినములలో||
kulamu, mathamu manissiki rakssanna ivvavani ninadinchandi yeesukreesthu prabhuvee ilaloo looka rakssakudanuchu muuddha nammakaalu bhuvipai samasipooyee varaku anaagarikulu, mathoonmaadulu - maarpu chendeevaraku kadali raavaali yuvajanamu - kalasi theevaali chaithanyam (2) bhaavi bhaaratha paurulaaraa - kadalirandi uththeejanthoo kreesthu raajyavaarasulaaraa - tharalirandi udveeganthoo ||kadavari dinamulaloo||