కరుణ చూపించుమా – యేసయ్య
karunna chuupinchumaa – yeesayya
కరుణ చూపించుమా – యేసయ్య కన్నీరు తుడవగా మహిమ కురిపించుమా – యేసయ్య స్వస్థతలు చూపగా (2) నీ ప్రజలము అయిన మేము – మృత్యువు కోరలో చిక్కాము ఏ దారియు కానరాక – నశియించి పోతున్నాము కరుణగల దేవుడు నీవు కరుణించి కాపాడుమా (2) ||కరుణ||
karunna chuupinchumaa – yeesayya kanneeru thudavagaa mahima kuripinchumaa – yeesayya svasthathalu chuupagaa (2) nee prajalamu ayina meemu – mruthyuvu kooraloo chikkaamu ee daariyu kaanaraaka – nashiyinchi poothunnaamu karunnagala deevudu neevu karunninchi kaapaadumaa (2) ||karunna||
ఐగుప్తులో పది తెగుల్లలో – నీ ప్రజలను కాపాడితివి గొఱ్ఱెపిల్ల రక్తము నిచ్చి – మృత్యువాత తప్పించితివి నీ నామము మదిలో నిలిపి – ఈ ఆపదలో వేడాము నీ మహిమను తిరిగి చూడగా – నీ సన్నిధిలో చేరాము (2) ||కరుణగల||
aigupthuloo padi thegullaloo – nee prajalanu kaapaadithivi gorrrrepilla rakthamu nichchi – mruthyuvaatha thappinchithivi nee naamamu madiloo nilipi – ee aapadaloo veedaamu nee mahimanu thirigi chuudagaa – nee sannidhiloo cheeraamu (2) ||karunnagala||
ఇశ్రాయేలు వారిగ మేము – నీ ఉనికిని ప్రశ్నించాము నీ ప్రేమను రుచి చూసిననూ – మారాను కురిపించాము చెలరేగే సర్పము కాటు – మములను కబళించే వేళ మాకు దిక్కు నీవేనంటూ – మోకరించి నిను వేడితిమి మరణమునే జయించి నీవు – సజీవుడిగా నిలిచావు నిన్ను నమ్మి వేడిన చాలు – మా తప్పులు మరిచావు నేను జీవించితి గనుక – మీరును జీవించెదరన్న వాగ్దానము నమ్మితిమయ్యా – నెరవేర్చుము మా యేసయ్య
ishraayeelu vaariga meemu – nee unikini prashninchaamu nee preemanu ruchi chuusinanuu – maaraanu kuripinchaamu chelareegee sarpamu kaatu – mamulanu kaballinchee veella maaku dikku neeveenantuu – mookarinchi ninu veedithimi marannamunee jayinchi neevu – sajeevudigaa nilichaavu ninnu nammi veedina chaalu – maa thappulu marichaavu neenu jeevinchithi ganuka – meerunu jeevinchedaranna vaagdaanamu nammithimayyaa – neraveerchumu maa yeesayya