కష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్ధన
kasstamochchinappudee kaadu praardhana
కష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్ధన నీకు ఇష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్ధన నీకు నష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్ధన
kasstamochchinappudee kaadu praardhana neeku isstamochchinappudee kaadu praardhana neeku nasstamochchinappudee kaadu praardhana
పేరుకు మాత్రం క్రైస్తవుడని ప్రభు వాక్యమునకు లోబడకుండా కుక్కల చేత పాముల చేత కరిపించుకు వస్తున్నారా ||కష్టమొచ్చినప్పుడే కాదు||
peeruku maathram kraisthavudani prabhu vaakyamunaku loobadakundaa kukkala cheetha paamula cheetha karipinchuku vasthunnaaraa ||kasstamochchinappudee kaadu||
టీ.వీ లు సినిమాలు చూసి కళ్ళను చెడగొట్టుకొని శుక్లాలు పెరిగి చత్వారమొస్తే ప్రభు సన్నిధికి వస్తున్నారా ||కష్టమొచ్చినప్పుడే కాదు||
tee.vee lu sinimaalu chuusi kallllanu chedagottukoni shuklaalu perigi chathvaaramosthee prabhu sannidhiki vasthunnaaraa ||kasstamochchinappudee kaadu||
మారుమనస్సు పొందకుండా మాయమాటలు చెబుతుంటారు ఆ దేవునికి ఈ దేవునికి మ్రొక్కి మ్రొక్కి మొదలవుతున్నాడు ||కష్టమొచ్చినప్పుడే కాదు||
maarumanassu pondakundaa maayamaatalu chebuthuntaaru aa deevuniki ee deevuniki mrokki mrokki modalavuthunnaadu ||kasstamochchinappudee kaadu||
నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించాలని భోదిస్తూ పొరుగువారిని ద్వేషించి ఓ ప్రభువా కాపాడంటావా ||కష్టమొచ్చినప్పుడే కాదు||
ninnuvale nee poruguvaarini preeminchaalani bhoodisthuu poruguvaarini dveessinchi oo prabhuvaa kaapaadantaavaa ||kasstamochchinappudee kaadu||
ఆదివారము మందిరమునకు రావు చెడ్డ చెడ్డ పనులు చేస్తుంటారు ||కష్టమొచ్చినప్పుడే కాదు||
aadivaaramu mandiramunaku raavu chedda chedda panulu cheesthuntaaru ||kasstamochchinappudee kaadu||